Share News

Supreme Court: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సుప్రీంలో ఊరట

ABN , First Publish Date - 2023-10-31T12:36:46+05:30 IST

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

Supreme Court: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి (Patancheru MLA Goodem Mahipal Reddy) సుప్రీం కోర్టులో (Supreme Court) ఊరట లభించింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టును తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యంగా సవాల్ చేసిన కారణంతో ఈ కేసును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.


పిటిషనర్ ఎం.ఏ.మొఖీం తరఫు వాదనలు

ఫ్యాక్టరీపై జరిగిన దాడిలో ఫ్యాక్టరీ వర్కర్లు, జనరల్ మేనేజర్లు తీవ్రంగా గాయపడ్డారని.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జి అయ్యారన్నారు. ఫ్యాక్టరీ యజమాని రాజీపడ్డారని.. కానీ బాధితుల గోడు, వాదన వినకుండానే కేసును క్వాష్ చేశారని వాదనలు వినిపించారు.


మహిపాల్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు

మహిపాల్ రెడ్డిపై కేసు వేసిన మొఖీం సోదరుడు ప్రత్యర్థి పార్టీలో అధికార ప్రతినిధి అని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన ఈ కేసు వేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన 400 రోజుల తర్వాత సుప్రీంను ఆశ్రయించారని.. ఇందులో రాజకీయ ఉద్దేశాలు తప్ప మరేమీ లేవన్నారు. హైకోర్టు కేసులో అన్ని మెరిట్స్ పరిశీలించిన తర్వాత క్వాష్ చేసిందని... ఫ్యాక్టరీ యజమాని రాజీపడ్డారని.. ఆ కారణంతోనే కేసును క్వాష్ చేసిందని తెలిపారు. ఇందులో ప్రజలకు సంబంధించింది ఏదీ లేదని, పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-10-31T12:36:46+05:30 IST