MP Laxman: కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది
ABN , First Publish Date - 2023-10-12T20:46:29+05:30 IST
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ ఎంపీ లక్మణ్(MP Laxman) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ ఎంపీ లక్మణ్(MP Laxman) వ్యాఖ్యానించారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఈశ్వరప్ప బీజేపీ పార్టీలో చేరారు. ఈశ్వరప్పకు పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈశ్వరప్ప రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈశ్వరప్ప బీజేపీలో చేరడం శుభపరిణామం. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీకీ లేదు. 20వేల కోట్లతో మత్స్యశాఖను కేంద్రం ఏర్పాటు చేసింది. బీసీల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీ పెద్ద పీట వేసింది. 54శాతం ఉన్న బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చింది. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేదు. ఈ రాష్ట్రంలోని 20 కులాలు కేంద్ర జాబితాలో చేరబోతున్నాయి’’ అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.