TS NEWS: ఆ కులాలపై జాతీయ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2023-09-05T19:25:18+05:30 IST
40 కులాలను ఓబీసీ జాబితా(OBC List)లో చేర్చాలనే డిమాండ్‌పై జాతీయ బీసీ కమిషన్(National BC Commission) ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.
ఢిల్లీ : 40 కులాలను ఓబీసీ జాబితా(OBC List)లో చేర్చాలనే డిమాండ్‌పై జాతీయ బీసీ కమిషన్(National BC Commission) ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంఘాల నేతలు కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహిర్, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య, ఎంపీలు కే. లక్ష్మణ్, బీబీ పాటిల్, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ మాట్లాడుతూ.. ఫైనల్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించామని.. కొన్ని కులాల అంశాల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, వాటిని మినహాయించి మిగతా కులాలను జాబితాలో చేర్చేందుకు కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.15 రోజుల్లో కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అవ్వగానే మిగతా వాటిని జాబితాలో చేర్చుతామని హన్స్‌రాజ్ తెలిపారు.