TDP Formation Day: కాళ్ళ బేరానికే జగన్ ఢిల్లీ వెళ్లాడు: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2023-03-29T19:27:44+05:30 IST

2024లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీలో సమాజిక న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు

TDP Formation Day: కాళ్ళ బేరానికే జగన్ ఢిల్లీ వెళ్లాడు: రామ్మోహన్ నాయుడు

హైదరాబాద్: 2024లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీలో సమాజిక న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతికి పునాదులు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు రామ్మోహన్ నాయుడు.

తెలంగాణలో టీడీపీ ఎక్కడుందనే వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ గాలిలో, నేలలో, ప్రతి ఇంటిపై, కర్షక కార్మికులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లో తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకున్న చరిత్ర.. ఏ ప్రాంతీయ పార్టీకి లేదని.. 41 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న పార్టీ.. మరిన్న దశాబ్దాల పాటు ప్రజాసేవలో ఉంటుందన్నారు.

జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మకంలేదని అన్నారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే సమయానికి వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.

ఏపీలో జగన్ అంత పిరికివాడు లేడని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. బాబాయ్ హత్య కేసులో కాళ్ళ బేరానికి జగన్ ఢిల్లీకి వెళ్లారని ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-03-29T19:39:19+05:30 IST