Share News

TSRTC MD Sajjanar: మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది..

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:32 PM

Telangana: ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త బస్సుల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు.

TSRTC MD Sajjanar: మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది..

హైదరాబాద్, డిసెంబర్ 30: ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త బస్సుల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయన్నారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 30 , 2023 | 01:33 PM