Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు
ABN , First Publish Date - 2023-09-29T09:45:07+05:30 IST
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి. నిన్న(గురువారం) ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి. నిన్న(గురువారం) ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నిన్న సాయంత్రం వర్షం కారణంగా నిమజ్జన ప్రక్రియ కాస్త నెమ్మదించింది. వర్షంలోనూ శోభాయాత్న కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి. నిమజ్జనం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. రాత్రి ఒంటిగంటకు చార్మినార్‌లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది. పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అర్ధరాత్రి రెండు గంటలకు నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు.