Share News

Sravan Kumar : కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చిన జడ శ్రవణ్

ABN , First Publish Date - 2023-11-02T12:44:39+05:30 IST

ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ సమావేశం కానున్నారు.

Sravan Kumar : కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చిన జడ శ్రవణ్

అమరావతి : ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ సమావేశం కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై తమ నిర్ణయాన్ని శ్రవణ్ కుమార్ ప్రకటించారు. ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని మతతత్వ పార్టీల నుంచి రక్షించాలంటే సెక్యులర్ భావజాలాన్ని గౌరవించే పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని మరోసారి జై భీమ్ అధినేత పిలుపునిచ్చారు.

తెలంగాణలో నవంబర్ 30న జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, జనసేనకు వ్యతిరేకంగా శ్రవణ్ కుమార్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉందని మరొకసారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ కుసుమ కుమార్‌తో శ్రావణ్ కుమార్ భేటీ కానున్నారు. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మరోసారి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-02T12:44:41+05:30 IST