కొండగట్టులో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2023-06-14T00:35:28+05:30 IST
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది.

మల్యాల, జూన్ 13: కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. వేలాదిగా భక్తులు వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. సాగు పనులు ప్రారం భం కానున్న నేపథ్యంలో భక్తులు అంజన్న సన్నిధికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. రోజంతా భక్తుల రద్దీ కొనసాగగా ఆలయంలో భక్తులు స్వా మి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. నూతన వాహనాల కు స్వామి వారి సన్నిధిలో పూజలు చేశారు. భక్తుల వాహనాలతో ఘాట్‌రో డ్డు, జేఎన్‌టీయూ మార్గం రద్దీగా మారింది. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఆలయ ఈవో వెంకటేష్, ఏఈవో శ్రీనివాస్ ఇతర అధికారులు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు.