అదనపు షాక్‌

ABN , First Publish Date - 2023-01-11T01:01:51+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులపై విద్యుత్‌ సంస్థ ఏసీడీ (అడ్వాన్స్‌ కన్జప్షన్‌ డిపాజిట్‌) పేరిట చార్జీల భారం మోపుతోంది.

అదనపు షాక్‌

- రూ. వేలల్లో బిల్లులు

- పలు గృహ విద్యుత్‌ కనెక్షన్లపై జారీ

- జనవరి బిల్లుతో కలుపుతున్న అధికారులు

జగిత్యాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులపై విద్యుత్‌ సంస్థ ఏసీడీ (అడ్వాన్స్‌ కన్జప్షన్‌ డిపాజిట్‌) పేరిట చార్జీల భారం మోపుతోంది. విద్యుత్‌ సంస్థ వినియోగదారుల నుంచి కొత్త రకం వసూ ళ్లకు తెరలేపడం ఆందోళనకు గురిచేస్తోంది. గత యేడాది ఇదే సమయం లో డెవలప్‌మెంట్‌ చార్జీ పేరిట అదనంగా బిల్లులు వసూలు చేశారు. ప్రస్తుతం జనవరి బిల్లులో సాధారణ చార్జీలతో పాటు ఏసీడీ బకాయి లతో కలిపి జారీ చేస్తున్నారు. సాధారణంగా కొత్తగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పుడు లోడ్‌, సర్వీస్‌ కనెక్షన్‌, మీటర్‌ సెక్యూరిటీ చార్జీలు వంటివి వసూలు చేస్తారు. ఈ మొత్తంలో రిఫండబుల్‌, నాన్‌ రిఫండబుల్‌ చార్జీలు ఉంటాయి. ఏవరైనా సర్వీసు రద్దు చేసుకున్న సమయాన రిఫండబుల్‌ డి పాజిట్లు తిరిగి ఇస్తారు. ఒకవేళ వినియోగదారుడు బిల్లు చెల్లించని పక్షం లో ఈ డిపాజిట్‌ను జమ చేసుకుంటారు. అన్ని కేటగిరీలకు ఇదే విధానా న్ని వర్తింపచేస్తుండగా మునుపెన్నడూ లేని విధంగా నూతనంగా తక్కు వ విద్యుత్‌ వినియోగించే గృహ వినియోగదారులపై ఏసీడీ చార్జీలు విధించారు.

జిల్లాలో కరెంటు కనెక్షన్లు సంఖ్య.

జిల్లా వ్యాప్తంగా 5,04252 మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. ఇందులో 159 హై ఓల్టేజీ కనెక్షన్లున్నాయి. కేటాగిరి 1 కింద అందించే గృ హాలకు అందించిన 3,21,776 కనెక్షన్లు, కేటాగిరి-2 నాన్‌ డొమేస్టిక్‌ కింద 36,526 కరెంటు కనెక్షన్లు, కేటాగిరి 3 కింద పరిశ్రమలకు 2,780, కేటాగిరి 4 కింద కాటేజీ పరిశ్రమలకు 1,186, కేటగిరి 5 కింద వ్యవసాయానికి 1,33,880, కేటగిరి 6 కింద పబ్లిక్‌ లైటింగ్‌కు 6,061 కనెక్షన్లు, కేటగిరి 7 కింద సాదారణానికి 1,788, కేటాగిరి 8 కింద తాత్కాలికానికి 96 కరెంటు మీటరు కనెక్షన్లున్నాయి.

గృహ కనెక్షన్లపై సైతం...

పలు రకాల కేటగిరీలపై మాత్రమే విధించే ఏసీడీ చార్జీలను ప్రస్తుతం తక్కువ విద్యుత్‌ వినయోగించే గృహ వినియోగదారులపై కూడా విధిం చారు. సాధారణంగా నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగం ఉంటే ఏసీడీ చార్జీ విధిస్తారు. అంతకు తక్కువ వినియోగించే వారికి ఏసీడీ చా ర్జీలను మద్యలో విధించిన సందర్భాలు గతంలో లేవు. అలాంటిది ప్రస్తు తం 300 లోపు యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారిపై కూడా ఏసీడీ చార్జీలను మోపింది. కొద్దిరోజులుగా జారీ చేస్తున్న జనవరి బిల్లులో ఏసీడీ బకాయి పేరిట అదనంగా ఉంటుందనడంతో వినియోగదారులు ఆందోళ నకు గురవుతున్నారు.

రెండు నెలల సగటు ఆధారంగా...

రెండు నెలల బిల్లును సగటుగా తీసుకొని ఏసీడీ చార్జీలు నిర్ణయించి బిల్లులో అదనంగా విధించారు. నెలకు రూ. 500 నుంచి రూ. 600 వరకు బిల్లు వచ్చే వినియోగదారులకు ఏసీడీ చార్జీ రూ. 1000కు పైగా జారీ చేశారు. అంటే నెలకు రూ. 600 వరకు బిల్లు వచ్చే వినియోగదారులు ఏసీడీ చార్జీ సూమారు రూ. వెయ్యి కలిపి ఈ నెలలో రూ. 1,600 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాగాఏసీడీ చార్జీలపై వినియోగదారుల నుంచి వి మర్శలు వస్తున్నాయి. కనెక్షన్‌ తీసుకున్న సమయాన డిపాజిట్‌ వసూలు చేసే విద్యుత్‌ శాఖ మరోసారి ఏసీడీ చార్జీ జారీ చేయడం సరికాదని చెబుతున్నారు.

విద్యుత్‌ లోడ్‌ అంచనా ఇలా..

గృహ వినియోగదారుడు మీటరు కేటాయింపు సమయంలో తీసుకున్న లోడ్‌కు మించి విద్యుత్‌ వాడితే అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఏసీ, గ్రీజర్‌, ఓవెన్‌, వాషింగ్‌ మిషన్‌, వాటర్‌ హీటర్లు వంటివి కొనుగోలు చేసి వాడుతుంటే లోడు దాదాపుగా రెండున్నర కిలో వాట్లకు చేరుతోంది. ఇలా వచ్చిన అదనపు లోడుకు కిలో వాట్‌కు రూ. 1500 చొప్పున డెవలప్‌ మంట్‌ చార్జీలు బిల్లులో వేస్తున్నారు. బల్పుకు 5 నుంచి 60 వాట్స్‌, సీలిం గ్‌ ఫ్యాన్‌ 50-150 వాట్స్‌, టీవీకి 150- 250 వాట్స్‌, ఫ్రిజ్‌ 60-250, సింగిల్‌ ఫేస్‌ మోటారు 375-1500, మిక్సీ 150-750, వాటర్‌ హీటర్‌ 550-1500, కంప్యూటర్‌ 100-250, ఏసీ 1000-3000 వాట్స్‌ వరకు లోడ్‌ అవుతోందన్న అంచనా వుంది. విద్యుత్‌ వినియోగానికి యజమాని ఇంట్లో వాడే పరిక రాలను బట్టి వెయ్యి వాట్స్‌కు అనుమతి పొందితే అంతలోపే వినియోగిం చాల్సి ఉంటుంది. వినియోగం పెరిగితే కిలో వాట్‌ పెరుగుతోంది.

కిరాయిదారులకు కొత్త కిరికిరి..

విద్యుత్‌ శాఖ వేస్తున్న అదనపు బిల్లుల వ్యవహారం జిల్లాలోని పలువు రు ఇంటి యజమానులు, కిరాయిదారుల మద్య కొత్త పంచాయతీకి తెర లేపింది. నిబంధనల ప్రకారం డెవలప్‌మెంట్‌ చార్జీలు, సెక్యూరిటీ డిపా జిట్‌, డెవలప్‌మెంట్‌ చార్జీలు, జీఎస్టీలు చెల్లించే విషయంలో ఇంటి యజ మానులకు, కిరాయిదారులకు మద్య వివాదం తలెత్తుతోంది. కిరాయి దా రు ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ వినియోగించడం వల్లే బిల్లు అధికంగా వచ్చిందని, వెంటనే చెల్లించాలని యజమానులు వాదిస్తున్నారు. ఇటీవల కొత్తగా ఇళ్లలో అద్దెకు చేరిన కిరాయి దారుల పరిస్థితి మరింత అధ్వానం గా తయారైంది. తాము చేరి కనీసం రెండు నెలలయినా కాలేదని, గతం లో అద్దెకు ఉండి ఖాళీ చేసి వెళ్లిపోయిన కిరాయిదారులు వినియోగించిన అదనపు విద్యుత్తుకు తాము ఎలా డెవలప్‌మెంట్‌ చార్జీలను చెల్లిస్తామని వాపోతున్నారు. కాగా ఇరు వర్గాలు అవగాహన కుదుర్చుకొని బిల్లులు చె ల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.

డిపాజిట్లుగా ఏసీడీ చార్జీలు

సత్యనారాయణ, ఎస్‌ఈ, జిల్లా విద్యుత్‌ శాఖ, జగిత్యాల

ఏసీడీ చార్జీలు డిపాజిట్లుగా ఉంటాయి. కనెక్షన్‌ లోడ్‌ పెరగడం, భద్ర తా చార్జీల కింద వీటిని జారీ చేస్తున్నాం. ఇందులో కొంత రిఫండబుల్‌, కొంత నాన్‌ రిఫండబుల్‌గా ఉంటుంది. వినియోగదారులు విద్యుత్‌ బిల్లుల తో పాటు ఏసీడీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-01-11T01:01:55+05:30 IST