KCR: భువనగిరిలో సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్..
ABN , First Publish Date - 2023-10-16T17:58:36+05:30 IST
భువనగిరిలో సభలో సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడుతూ 98 శాతం పూర్తయిన బస్వాపూర్ ప్రాజెక్టును ఎన్నికలయ్యాక పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

యాదాద్రి: భువనగిరిలో సభలో సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడుతూ 98 శాతం పూర్తయిన బస్వాపూర్ ప్రాజెక్టును ఎన్నికలయ్యాక పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
"కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇక్కడ ఆరాచక మూకలను పోషిస్తే.. ఆ అరాచక మూకలను మేము ఏరి పారేశాం. పొరపాటున కాంగ్రెస్ వస్తే ధరణి, దళిత బంధు పోయి దళారుల రాజ్యం వస్తుంది. ఎన్నికల తర్వాత భువనగిరికి ఐటీ, ఇండస్ట్రీయల్ పార్కు ఇస్తాం. భువనగిరిలో 50 వేలపై చిలుకు మెజారిటీతో పైళ్ల శేఖర్ రెడ్డి గెలుస్తారని సర్వేలో తెలిసింది. కరెంటు 24 గంటలు కావాలా... 3 గంటలు కావాలా." అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు.