రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి
ABN , First Publish Date - 2023-02-19T23:26:20+05:30 IST
రాష్ట్ర ప్రభు త్వం హాయంలోనే తండాల అభివృద్ధి చెందాయ ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర ంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడా రు.

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి అర్బన్, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభు త్వం హాయంలోనే తండాల అభివృద్ధి చెందాయ ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర ంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడా రు. గిరిజనుల సమావేశాలు, సామూహిక కార్య క్రమాల కోసం సేవాలాల్ మహారాజ్ భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్ర భుత్వ చర్యలతో ప్రతీ ఎకరాకు సాగునీరు అందు తోందని, తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి రాకతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. వనపర్తికి సాగునీటి రాకతో వ్యవసాయ ఉత్పత్తులు పెరి గాయని, రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల చే తుల్లో 92.5 శాతం భూమి ఉందన్నారు. గిరిజ నుల చేతిలో కూడా 19 లక్షల ఎకరాల భూమి ఉందని, తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు. తండా లను పంచాయతీలుగా మార్చడంతో మన తండాలో మన రాజ్యం కల సాకారమైందన్నారు. ప్రతీ తండాకు నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, ప్రతీ తండాకు బీటీ రహదారులు నిర్మాణమయ్యాయి, నిర్మాణ మవుతున్నారు. గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త కావలి మన్యం ప్రమాదవశాత్తు మరణించడంతో మం జూరైన రూ.2 లక్షల బీమా సొమ్మును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, గిరిజన ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీరంగాపురం మండలం నాగరా ల సర్పంచ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో తాపీ మేస్ర్తీ సంఘం సభ్యులు 30 మంది మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, అమ్మ ఒడి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సాగునీటి రాకతో పల్లెల స్వరూపం మారిందని, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలలో మార్పులు వస్తున్నాయన్నారు.