Errabelli: భారీ వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా
ABN , First Publish Date - 2023-07-29T19:56:51+05:30 IST
భారీ వర్షాలు (Rains), వరదలు (floods), నష్టంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సమీక్ష నిర్వహించారు.
వరంగల్: భారీ వర్షాలు (Rains), వరదలు (floods), నష్టంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సమీక్ష నిర్వహించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సమీక్షాసమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరద బాధితులను కాపాడిన డీఆర్ఎఫ్ టీంకు ప్రశాంస పత్రాలు అందజేత చేశారు.
"వర్షాలతో ప్రభుత్వ ఆస్తులకు రూ.414 కోట్ల నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే నేడు వరంగల్ నగరానికి ఈ పరిస్థితి. 40 ఏళ్ల కింద చెరువులు, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. అన్నీ శాఖల అధికారులు కష్టపడి నష్ట నివారణకు చర్యలు తీసుకున్నారు. రూ.150 కోట్లతో భద్రకాళీ పునరుద్దరణ. రూ.15 కోట్లతో వడ్డేపల్లి చెరువు, రూ.75 కోట్ల నాళాల నష్టం జరిగింది. విష జ్వరాలు వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక్క చెరువు దెబ్బ తింటే పది చెరువులపై ప్రభావం ఉంటుంది. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల రూ.95 వేలు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తాం." అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.