Share News

TS News: నాగార్జునసాగర్ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్

ABN , First Publish Date - 2023-12-01T09:48:52+05:30 IST

Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ రాష్ట్ర పోలీసులు మోహరించారు. ఇటు తెలంగాణ పోలీసులు డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు.

TS News: నాగార్జునసాగర్ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ రాష్ట్ర పోలీసులు (AP Police) మోహరించారు. ఇటు తెలంగాణ పోలీసులు (Telangana Police) డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు (శుక్రవారం) ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకొని పరిస్థితి అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి దౌర్జన్యంగా విడుదల అయ్యాయి. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 522 అడుగుల చేరువలో ఉంది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది. నిన్నటి నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

Updated Date - 2023-12-01T09:48:55+05:30 IST