Prakash Javadekar: తెలంగాణకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదు

ABN , First Publish Date - 2023-06-13T11:57:33+05:30 IST

తెలంగాణకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అందరివాడని.. ప్రధానిపై కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితమన్నారు.

Prakash Javadekar: తెలంగాణకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదు

నిజామాబాద్: తెలంగాణకు (Telangana State) నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ (Former Union Minister, MP Prakash Javadekar) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోడీ (Primeminister Narendra Modi) అందరివాడని.. ప్రధానిపై కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితమన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క మంత్రిపైన కూడా అవినీతి అక్రమాల ఆరోపణలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్న ప్రభుత్వం మాది అని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ (CM KCR) చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మద్దతు ధరల కోసం రైతుల పోరాటానికి కాంగ్రెస్ విధానాలే కారణమని ఆరోపించారు. బీజేపీ పాలనలో పంటలకు మద్దతు ధరలు ఇస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు సబ్సిడీలు పెంచామన్నారు. కిసాన్ సమ్మాన్ ద్వారా 11 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరిందని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-27T12:36:22+05:30 IST

News Hub