డీసీఎంను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు
ABN , First Publish Date - 2023-02-23T00:18:51+05:30 IST
ఆర్టీసీ బస్సు-డీసీఎం మీనీ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన బుధవారం నందిగామ మండల బైపాస్ వద్ద చోటుచేసుకుంది

నందిగామ, ఫిబ్రవరి 22: ఆర్టీసీ బస్సు-డీసీఎం మీనీ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన బుధవారం నందిగామ మండల బైపాస్ వద్ద చోటుచేసుకుంది. వనపర్తి డిపో అద్దె బస్సు ఉదయం హైదరాబాద్ నుంచి వనపర్తికి బయల్దేరింది. బస్సు డ్రైవర్ బస్సును అతివేగంగా నడుపుకుంటూ వస్తూ నందిగామ బైపాస్ మీదుగా వెళుతున్న డీసీఎంను వెనుకనుంచి ఢీకొట్టాడు. దీంతో బస్సులోని ఎనిమిది ప్రయాణికులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందని బస్సు ప్రయాణికులు తెలిపారు.