వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సందర్శించిన పరిశీలించిన మహారాష్ట్ర మహిళా రైతులు

ABN , First Publish Date - 2023-03-14T23:16:39+05:30 IST

తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానాన్ని మంగళవారం మహారాష్ట్రకు చెందిన మహిళా రైతులు సందర్శించారు.

వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సందర్శించిన పరిశీలించిన మహారాష్ట్ర మహిళా రైతులు

తాండూరు, మార్చి 14 : తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానాన్ని మంగళవారం మహారాష్ట్రకు చెందిన మహిళా రైతులు సందర్శించారు. ఆత్మ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన 40 మంది మహిళా రైతులు పరిశోధన స్థానాన్ని సందర్శించి కుసుమ, కంది, జొన్న పంటలపై జరుగుతున్న పరిశోధన గురించి తెలుసుకున్నారు. కుసుమ నూనె, ఆర్గానిక్‌ కందిపప్పు తయారీ యూనిట్లను పరిశీలించారు. తమ పంట ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌లో అమ్మేదానికంటే ప్రాసెసింగ్‌ చేసి ఆహార ఉత్పత్తులుగా మార్చి అమ్మినట్లయితే అధిక లాభాలు గడించవచ్చని పరిశోధన స్థానం హెడ్‌ డాక్టర్‌ సుధారాణి మహారాష్ట్ర మహిళా రైతులకు వివరించారు. ముఖ్యంగా నూనె మిల్లు, పప్పు తయారీ యంత్రాలపై వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పి.రాజేశ్వర్‌రెడ్డి, ఆత్మ ఔరంగాబాద్‌ జిల్లా అధికారి పల్లవి గైక్వాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-14T23:16:39+05:30 IST