TS Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఈ వెబ్‌సైట్‌లో చూసేయండి..

ABN , First Publish Date - 2023-05-09T11:15:08+05:30 IST

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు..

TS Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఈ వెబ్‌సైట్‌లో చూసేయండి..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను మంత్రి రిలీజ్ చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. కాగా.. ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఈ ఫలితాలను https://tsbie. cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్లలో చూడవచ్చు.

మొదటి సంవత్సరం ఇలా.. :-

బాలికల ఉత్తీర్ణతాశాతం : 68.68

బాలుర ఉత్తీర్ణతాశాతం : 54.66

ఫస్టియర్‌‌లో మొత్తం పాసైన వారు : 63.85 శాతం

రెండో సంవత్సరం ఇలా.. :-

బాలికల ఉత్తీర్ణతాశాతం : 71.57

బాలుర ఉత్తీర్ణతాశాతం : 55.60

మొత్తం పాసైన వారు : 63.49 శాతం మాత్రమే

సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీలు..

  • ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ కాలేజీల కంటే ముందంజలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు

  • ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పాసైన విద్యార్థులు : 63 శాతం

  • రెసిడెన్షియల్ కాలేజీల్లో 92 శాతం

  • సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 80 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇది సంతోషించదగ్గ విషయేనని చెప్పుకోవచ్చు.

ఏ జిల్లా టాప్ అంటే..

గత సంవత్సరం కంటే పాస్ పర్సెంటేజ్ ఈ ఏడాది చాలా తగ్గింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా, మూడో స్థానంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచింది. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

కీలక సూచనలు..

కాగా.. జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. మే- 10 నుంచి మే- 16 వరకు సప్లిమెంటరీ పరీక్షలకు అప్లయ్ చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేసుకునే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. వారిని ఒత్తిడికి గురి చేయొద్దని తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎంసెట్ రాసేవాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాయండని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఇంటర్ వేయిటేజీ లేదు కాబట్టి విద్యార్థులు ఈ ఫలితాలను పట్టించుకోవద్దని మంత్రి తెలిపారు.

Updated Date - 2023-05-09T11:43:52+05:30 IST