TS News: బ్యాంకులను మోసగించేందుకు దొంగల ముఠా యత్నం

ABN , First Publish Date - 2023-01-28T17:32:35+05:30 IST

నగరంలో (Hyderabad)( దుండగులు హల్‌చల్ చేశారు. నకిలీ పత్రాలతో బ్యాంకు (Bank) లను మోసగించేందుకు దొంగల ముఠా యత్నించింది.

TS News: బ్యాంకులను మోసగించేందుకు దొంగల ముఠా యత్నం

హైదరాబాద్‌: నగరంలో (Hyderabad)( దుండగులు హల్‌చల్ చేశారు. నకిలీ పత్రాలతో బ్యాంకు (Bank) లను మోసగించేందుకు దొంగల ముఠా యత్నించింది. నలుగురు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసు (CCS Pollice) లు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 చెక్కులు, నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.2.25 కోట్ల బ్యాంక్‌ లోన్ కోసం నకిలీ పత్రాలు ఆ ముఠా సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. వెరిఫికేషన్‌లో బ్యాంక్ అధికారులునకిలీలను గుర్తించారు. గతంలోనూ ఫేక్‌ పత్రాలతో రూ.35 కోట్ల వరకు మోసాలకు ముఠా పాల్పడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు. మఠా సభ్యులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు ఇలా ఎన్ని చోట్ల మోసాలకు పాల్పడ్డారు? ఎంతమందిని మోసం చేశారు? వీరిపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి క్షణం బ్యాంకు అధికారులు అప్రమత్తతంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పరిశీలిన చేయాలన్నారు. బ్యాంకు అధికారులు అప్రమత్తంగా లేకుండా దుండగులు మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి అసలు నిజాలు బయటపడేలా విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-01-28T17:34:22+05:30 IST