Hyderabad: కూకట్పల్లిలో ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి
ABN , First Publish Date - 2023-01-05T18:06:11+05:30 IST
కూకట్పల్లి (Kukatpally)లో ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు తల్వార్తో దాడి చేశారు. మాదాపూర్ (Madapur) ఎస్ఓటీ కానిస్టేబుళ్లు రాజు, వినయ్పై దాడి చేశారు.

హైదరాబాద్: కూకట్పల్లి (Kukatpally)లో ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు తల్వార్తో దాడి చేశారు. మాదాపూర్ (Madapur) ఎస్ఓటీ కానిస్టేబుళ్లు రాజు, వినయ్పై దాడి చేశారు. కేసు దర్యాప్తు నిమిత్తం కానిస్టేబుళ్లు (constables) రాజు, వినయ్ సిక్కుల బస్తీకి వెళ్లారు. కానిస్టేబుల్ రాజు ఛాతీలో పొడిచారు. దాడిలో మరో కానిస్టేబుల్ వినయ్ తలకు గాయాలయ్యాయి. కూకట్పల్లి రాందేవ్రావు ఆసుపత్రికి కానిస్టేబుళ్లను తరలించారు. కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించారు.