Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట
ABN , Publish Date - Oct 25 , 2024 | 05:39 PM
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వారిద్దరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని నవంబర్ 6వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
అమరావతి, అక్టోబర్ 25: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వేయాలంటూ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో నవంబర్ 6వ తేదీన నిర్ణయాన్ని వెళ్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఆధారంగా వీరిపై తదుపరి చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా..ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో తన మిత్రుడు శిల్ప రవిచంద్రరెడ్డికి మద్దతు తెలుపుతు ఆయన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అదీకాక హీరో అల్లు అర్జున్ భారీ కాన్వాయి్‌లో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. మరోవైపు తమ నేత ఇంటికి హీరో అల్లు అర్జున్ వచ్చారన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అనుచర గణం అక్కడికి భారీగా చేరుకుంది.
Also Read: సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
నంద్యాల పోలీసులు కేసు నమోదు..
దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అల్లు అర్జున్‌తోపాటు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో నంద్యాల పోలీసులు తమపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌తోపాటు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ పిటిషన్‌పై వాదనలు ఈ రోజు రోజు జరిగాయి.
Also Read: Cyclone Dana: తీరం దాటిన దానా.. పోర్టుల వద్ద హెచ్చరికలు తొలగింపు
ఎన్నికల వేళ.. పెద్ద రచ్చ..
మరోవైపు అల్లు అర్జున్ సమీప బంధువు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. అదే సమయంలో కూటమి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో మాత్రం ఆంధ్ర ఓటరు కూటమికి పట్టం కట్టారు. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా పోయింది. ఆ పార్టీ నుంచి కేవలం 11 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
For Andhra News And Telugu News..