JUNIOR COLLEGE: అసౌకర్యాల నడుమ జూనియర్ కళాశాల
ABN , Publish Date - Jun 30 , 2024 | 11:40 PM
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడి 13ఏళ్లు అవుతున్నా నేటికీ అవసరమైన భవనాలు, ఇతర వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు, గెస్ట్ ప్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. నేటికీ రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు అనుమతులు లేవు. ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభకనబరుస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు దృష్టి సారించడంతో విఫలమవుతున్నారు.
రెగ్యులర్ అధ్యాపకులు నిల్
ఇక్కడే బాలికల కళాశాల నిర్వహణ
ఉరవకొండ, జూన 30: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడి 13ఏళ్లు అవుతున్నా నేటికీ అవసరమైన భవనాలు, ఇతర వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు, గెస్ట్ ప్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. నేటికీ రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు అనుమతులు లేవు. ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభకనబరుస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు దృష్టి సారించడంతో విఫలమవుతున్నారు. ఒకటిన్నర దశాబ్ధ కాలంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే చదువుకోవాల్సి వస్తోంది. 2009 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలలో 220మంది దాకా విద్యార్థినులున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లోని విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. హెచఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. నేటికీ సొంత భవనాలు నిర్మించలేదు. ప్రభుత్వ బాలికల కళాశాల నిర్మాణం కోసం 2ఎకరాల స్థలం కేటాయించినా ఆ ఫైల్ ముందుకు సాగలేదు. రెగ్యులర్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భోతనేతర సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. బాలుర కళాశాల భవనంలోనే ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. 8 గదులు మాత్రమే ఉన్నాయి. ల్యాబ్‌కు అవసరమైన గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ మమతను వివరణ కోరగా కళాశాల భవననిర్మాణం కోసం 2 ఎకరాల స్థలం కేటాయించారని, ప్రస్తుతం కలెక్టరేట్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. రెగ్యూలర్ అధ్యాపకులు లేరు.