పంచాయతీ గోడలకు తొలగని వైసీపీ రంగులు
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:29 PM
నార్పల పంచాయతీ కార్యాలయం గోడలకు వైసీపీ రంగులు వేశారు. కోడ్ అమల్లోకి వచ్చినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

నార్పల, ఏప్రిల్ 16: నార్పల పంచాయతీ కార్యాలయం గోడలకు వైసీపీ రంగులు వేశారు. కోడ్ అమల్లోకి వచ్చినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ కార్యాల యంలో సీఎం జగన ఫ్లెక్సీని ఉంచారు. అదే కార్యాలయంలో సర్పంచు సుప్రియ, ఎంపీడీఓ రాముడు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాల్సిన ఎంపీడీఓ రాముడు ఇతర అధికారులు పంచాయతీ కార్యాలయం గోడలకు వైకాపా రంగులున్నా.. వాటిని తొలగించకుండానే అదే గదిలో గ్రామ సభ నిర్వహించారు. కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా... వైసీపీ రంగులను అధికారులు తొలగించకుండా అధికారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు.