KALAVA CAMPAIN: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం
ABN , Publish Date - May 12 , 2024 | 12:07 AM
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థితిని, గతిని మార్చే ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయన్నారు. ఐదేళ్ల జగనమోహనరెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి చూడబోతున్నామన్నారు.
కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, మే 11: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థితిని, గతిని మార్చే ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయన్నారు. ఐదేళ్ల జగనమోహనరెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి చూడబోతున్నామన్నారు. అర్జెంటుగా జగనమోహనరెడ్డిని కుర్చీ నుంచి దించాలన్న కసి, పట్టుదల అన్ని వర్గాల ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు చేతిలోనే రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు ఉందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో అచెంచలంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు చరిత్రను సృష్టించబోతున్నాయన్నారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశలో ఏరకమైన ప్రభంజనం టీడీపీ సృష్టించిందో అలాంటి ఫలితాలు పునరావృతం కాబోతున్నట్లు తెలిపారు. భారీ మెజార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు దక్కబోతున్నట్లు తెలిపారు. రాయదుర్గం 50 వేల మెజార్టీ తగ్గకుండా తాను విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
వ్యాపారుల జోలికి రాకుండా చూసుకుంటా: తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారులు ఉన్నారని అదే వాతావరణాన్ని మళ్లీ మీకు కల్పించి, మీ జోలికి ఎవరూ రాకుండా చూసుకుంటానని కా లవ శ్రీనివాసులు అ న్నారు. శనివారం ఆ ర్యవైశ్య కళ్యాణమంటపంలో ఆల్ మర్చెంట్స్ అసోసియేషన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రాంతాన్ని ఇ తర ప్రాంతాలతో తీసిపోని విధంగా అభివృద్ధి చేయాలన్నదే తన కల, సంకల్పమన్నారు. చంద్రబాబు ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నట్లు తెలిపారు.
కుటుంబీకుల ప్రచారం: కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు కోడలు కాలవ నిర్మల శనివారం పట్టణంలోని 7వ వార్డులో మామను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కూతురు కాలవ గౌతమి కణేకల్లు మండలంలోని మాల్యం గ్రామంలో, కొడుకు కాలవ భరత డీ.హీరేహాళ్ మండల ఎస్‌ఆర్ కోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తండ్రిని గెలిపించాలని కోరారు.