HLC VISIT: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపడతాం
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:46 PM
సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని చెర్లోపల్లి 11ఏ/600 కి.మీ వద్దనున్న యూటీ పనులను డీఈ మద్దిలేటితో కలిసి ఆయన పరిశీలించారు.
బొమ్మనహాళ్, జూన 28: సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని చెర్లోపల్లి 11ఏ/600 కి.మీ వద్దనున్న యూటీ పనులను డీఈ మద్దిలేటితో కలిసి ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నీరు ప్రవాహం సమయంలో ఇబ్బందులు కలుగకుండా పనులు జరిపించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సాగునీటిని ఆయకట్టుకు అందించాలన్నారు. అండర్ టన్నెల్‌లో నీరు వెళ్లేందుకు అవకాశం లేని విధంగా మొత్తం పూడిక పేరుకుపోయి వర్షపునీటి ప్రవాహం జరగని కారణంగానే స్లాబ్‌పైకి వచ్చిందని, వెంటనే మరమ్మతులు చేయకపోయి ఉంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. నీళ్లు వచ్చేలోపు పనులు జరుగుతాయని అన్నారు. గత ఐదేళ్లేలలో వైసీపీ ప్రభుత్వం కనీస మరమ్మతులు చేయని కారణంగానే జీప్‌ట్రాక్ దెబ్బతిందన్నారు. ఎక్కడ చూసినా ముళ్లపొదలు పెరిగిపోయి నడవడానికి ఇబ్బందికర పరిస్థితిలో ఎగువకాలువ జీప్‌ట్రాక్ ఉందన్నారు. కాలువ ఆధునికీకరణ ఆవశ్యకతను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్యక్రమంలో జేఈ అల్తాఫ్, టీడీపీ మండల కన్వీనర్ బలరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కండి
రాయదుర్గం: కూటమికి అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు సేవ చేసేందుకు రాయదుర్గం అభివృద్ధిలో బీజేపీ, జనసేన పార్టీలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమండపంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ హీరోజీరావు అధ్యక్షతన ఎమ్మెల్యేకు అభినందనసభను ఏర్పాటు చేశారు. ఆయనకు శాలువ కప్పి మెమెంటోను అందించి సత్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వసుంధరాదేవి, అంబోజీరావు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.