Share News

CI: వీఆర్‌కు సీఐ కరుణాకర్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:12 AM

మండల కేంద్రానికి చెం దిన టీడీపీ కార్యకర్త రామన్నను పోలీసులు కొట్టిన ఘటనలో సీఐ కరుణాకర్‌ ను వీఆర్‌ కు పంపుతూ బుధవారం అ నంతపురం రేంజ్‌ డీఐజీ షిముషి ఆదేశాలు జారీ చేశా రు. డబ్బుల విషయంలో మంగళవారం రాత్రి పెద్దమనిషిగా వెళ్లిన మాజీ సర్పంచ కుటుంబ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రామన్నను సీఐ కరుణాకర్‌ కొట్టారని టీడీపీ కార్యకర్తలు, నేతలు స్థానిక స్టేషన ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్‌ విచారణ చేసి డీఐజీ షిముషికి నివేదిక ఇచ్చారు.

CI:  వీఆర్‌కు సీఐ కరుణాకర్‌

బుక్కరాయసముద్రం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి చెం దిన టీడీపీ కార్యకర్త రామన్నను పోలీసులు కొట్టిన ఘటనలో సీఐ కరుణాకర్‌ ను వీఆర్‌ కు పంపుతూ బుధవారం అ నంతపురం రేంజ్‌ డీఐజీ షిముషి ఆదేశాలు జారీ చేశా రు. డబ్బుల విషయంలో మంగళవారం రాత్రి పెద్దమనిషిగా వెళ్లిన మాజీ సర్పంచ కుటుంబ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రామన్నను సీఐ కరుణాకర్‌ కొట్టారని టీడీపీ కార్యకర్తలు, నేతలు స్థానిక స్టేషన ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్‌ విచారణ చేసి డీఐజీ షిముషికి నివేదిక ఇచ్చారు. దీంతో సీఐ కరణాకర్‌ను తిరు పతి ఎస్పీ కార్యాలయానికి అటాచ చేస్తూ, వీఆర్‌కు బదలీ చేస్తూ ఉత్త ర్వులు డీఐజీ జారీ చేశారు. వీటితో పాటు.. గతంలో టీడీపీ కార్యక ర్త లపై అక్రమ కేసులు బనాయించిన సీఐ కరుణాకర్‌పై చర్యలు తీసు కోవాలని టీడీపీ నాయకులు ఆలం నరసానాయుడు, ముంటి మడుగు కేశవరెడ్డి, రామలింగారెడ్డి, పర్వతనేని శ్రీధర్‌బాబు ఇటీవలే అనంతపు రం పర్యటనకు వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కూడా సీఐ టీడీపీ కార్యకర్తలను కొట్టడం, అక్ర మ కేసులు బనాయిస్తుండడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటనను నియోజకవర్గం నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత సీఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులకు సూచించినట్లు సమాచారం.

హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌...

బుక్కరాయసముద్రంలోని అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషనలో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌ను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ జగదీష్‌ బుధ వారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తను కొట్టిన ఘటనతో పాటు ఇటీవలే సరైన విచారణ చేయకుండా పలువురు టీడీపీ కార్యక ర్తలపై కేసులు నమోదు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అలాగే చనిపోయిన వ్యక్తిపై ఒక ఎఫ్‌ఐఆర్‌లో కేసు నమోదు చేశార ని, అవినీతి ఆరోపణలు వచ్చాయని వీఆర్‌కు పంపినట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 27 , 2025 | 12:12 AM