Share News

Andhra Pradesh: బయబటపడనున్న వైసీపీ నేతల బండారం..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:31 AM

Andhra Pradesh: వైసీపీ హయాంలో మంజూరుచేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కు ఆదేశాలు జారీచేసింది. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీ సీఐడీ రంగంలోకి దిగుతోంది. తణుకులో జరిగిన కుంభ కోణం పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శాసనసభలో ప్రస్తావించారు. తాడేపల్లిగూడెం కుంభకోణంపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబి మున్సిపల్ అధికారులకు వివరాలు అందజేశారు.

Andhra Pradesh: బయబటపడనున్న వైసీపీ నేతల బండారం..!
CM Chandrababu

Andhra Pradesh: వైసీపీ హయాంలో మంజూరుచేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కు ఆదేశాలు జారీచేసింది. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీ సీఐడీ రంగంలోకి దిగుతోంది. తణుకులో జరిగిన కుంభ కోణం పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శాసనసభలో ప్రస్తావించారు. తాడేపల్లిగూడెం కుంభకోణంపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబి మున్సిపల్ అధికారులకు వివరాలు అందజేశారు. దీంతో ప్రభుత్వం విశాఖపట్నం, తిరుపతి, తణుకులతో పాటు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ఈ కుంభకోణం తేల్చాలని సీబీసీఐడీని ఆదేశించింది.


వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మునిసిపాలిటీలో పోస్ట్ యార్డు విస్తరణ కోసం ఆరు ఎకరాలను కొనుగోలు రు. ఎకరానికి రూ.కోటి చెల్లించేలా స్థల యజమానులతో నిసిపాలిటీకి ఒప్పందం కుదిరింది. ఇంత వరకు బాగానే ఉంది. కాని తర్వాత మున్సిపాలిటీ దానిని గజాల్లో మార్చేసి, గజం ధర రూ.20) వేలుగా నిర్ణయించింది. రోడ్లు విస్త రించాల నుకున్నప్పుడే మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా స్థలాలను సేకరి స్తారు. ఇందుకోసం స్థల యజమానులకు గజానికి నాలుగు రెట్లు విలువైన బాండ్లు జారీచేస్తారు. కానీ తణుకులో కంపో యార్డు కోసం ముందుగానే స్కెచ్ వేసి భూమిని గజాల్లో సేకరించారు. సెంటుకు 48 గజాల వంతున ఎకరానికి 4,800 గజాలుగా నిర్ణయించారు. నాలుగు రెట్లు టీడీఆర్ బాండ్లు జారీచేశారు.


ఒక్కో గజానికి రూ.20 వేల ధరతో బాండ్లు మంజూరయ్యాయి. అంటే ఎకరం విలువ రూ.నిగి కోట్లు అయ్యింది. కేవలం రూ.కోటి విలువ చేసే భూమిని రూ.38 కోట్ల విలువతో మున్సిపాలిటీ సేకరించింది. కంపోస్ట్ యార్డు కోసం గజాల రూపంలో సేకరించి టీడీఆర్ బాండ్లు జారీ చేయడం ఒక తప్పిదమైతే రిజిస్ట్రేషన్ చేయకుండానే ఒప్పందం చేసుకున్న వారి పేరుతో మంజూరు చేయడం మరో తప్పిదం. ఈ విషయంలో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించారు.


కొత్త రహదారి ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ అంటూ మరో తొమ్మిది ఎకరాలు భూమికి బాండ్లు జారీ అయ్యాయి. మొత్తంగా 21 ఎకరాలకు రూ.900 కోట్ల విలువైన బాండ్లు జారీ ఆయ్యా యి. అప్పట్లో టీడీపీ గట్టి పోరాటం చేయడంతో ప్రభుత్వం తూతూమంత్రంగా దర్యాప్తు చేపట్టింది. తక్షణం మునిసిపల్ కమిషనర్, టీపీవోలను సస్పెండ్ చేశారు. బాండ్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. బాండ్ల మంజూరులో కీలకపాత్ర పోషిం చిన వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు లేవు. బాండ్ల కొనుగోలు చేసిన వారంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు వీటిపై సీబీసీఐడీ దర్యాప్తు జరగనుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్లపై పట్టు బిగించింది. బాండ్ల జారీతోపాటు, అమ్మకం నిర్వహించిన వారు బలి కానున్నారు. వైసీపీ నేత ఖాతాలోనూ నేరుగా జమ అయితే ఆయనపైనా చర్యలు ఉండే అవకాశం ఉంది.


తాడేపల్లిగూడెంలో నేతకే ముడుపులు..

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ముగ్గురు కమిషనర్లు రహదారి విస్తరణ పేరుతోనే టీడీఆర్ బాండ్లు జారీచేశారు. లబ్ధి మాత్రం వైసీపీ నేతకు దక్కింది. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కూటమి నేతల లెక్కల ప్రకారం రూ.142 కోట్ల విలువైన బాండ్ లు జారీచేశారు. అధికారులు మాత్రం రూ.82 కోట్ల విలువైన బాండ్లు జారీ చేసినట్టు లెక్కలు చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలోనూ స్థల యజమానుల పేరుతో కాకుండా ఒప్పందం చేసుకున్న వారితో బాండ్లు జారీ అయిన ఉదంతా లు ఉన్నాయి. వైసీపీ నేత మున్సిపల్ అధికారుల మెడపై కత్తి పెట్టి ఉన్నతాధికారులతో ఒత్తిడి పెంచి బాండ్లు మంజూరు చేయించారు. ప్లాన్ లేకుండా వైసీపీ నేత కల్యాణ మండ పం నిర్మించారు. అదే స్థలంలో రహదారి విస్తరణ అంటూ వైసీపీ నేత పేరుతో బాండ్లు మంజూరుచేశారు. తెలుగుదేశం నాయకులు పట్టుబడితే అక్కడ స్థలాన్ని సేకరించినట్లు హద్దు లు గీశారు.


మిగిలినచోట్ల ఎక్కడా స్థలాలను సేకరించ కుండానే బాండ్లు జారీ అయ్యాయి. అటువంటి చోట్ల వ్యాపా ర సముదాయాలు వున్నాయి. రహదారి విస్తరిస్తేనే స్థల సేకరణ ఆవశ్యకత ఉంటుంది. రహదారి విస్తరణ జరగదని తెలిసే మాస్టర్ ప్లాన్ పేరుతో 100 అడుగులకు బాండ్లు జారీ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం-భీమవరం రహదారి వెంబడి మున్సిపాలిటీ ఇటువంటి దందా సాగించింది. ఇప్పుడు సీబీసీ ఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అధికారుల వెన్నులో వణు కు పుడుతోంది. బాండ్లు జారీచేసిన అధికారులు ఇతర చోట్లకు బదిలీపై వెళ్లిపోయారు. వారంతా కూటమి నేతలతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. త్వరలోనే ఈ రెండు మునిసిపాలిటీల్లో గట్టు రట్టుకానుంది.


Also Read:

వారిని బదిలీ చేసినా వెళ్లరట!

పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?

కొత్త కోచ్.. కొత్త కెప్టెన్..a

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 27 , 2024 | 10:31 AM