AP News: వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద బైక్‌తో యువకుడి వీరంగం.. డీఎస్పీకి గాయాలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 10:26 AM
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద బైకుపై యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే తన వాహనంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు పైకి ఓ యువకుడు దూసుకెళ్లాడు.
నెల్లూరు: వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద బైకుపై యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే తన వాహనంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు పైకి ఓ యువకుడు దూసుకెళ్లాడు. దీంతో డీఎస్పీకి స్వల్ప గాయాలు అయ్యాయి. సదరు యువకుడు మాత్రం పోలీసులకు చిక్కలేదు. దీంతో ఆ ప్రాంతంలోని పోలీసులందరికీ ఆ యువకుడికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. చివరకు ఆత్మకూరు ప్రాంతంలో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాత్రిళ్ళు రోడ్డుపై వెళుతున్న వారిని కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని దోచుకుంటున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోటోగ్రాఫర్ రమేష్‌ను కత్తితో బెదిరించి డబ్బులు లాక్కున్నారు. ఆ వెంటనే రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా యువకులను గుర్తించారు. యువకులను పట్టుకుని.. వారి వద్ద నుంచి చాకు, 5000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. భీమవరంలోని చిన అమిరం గ్రామానికి చెందిన కొడాలి సతీష్, బిరుదుగడ్డ నరేష్, గూడపాటి ఉదయ్ కుమార్, తెనాలి దావీదుగా పోలీసులు సదరు యువకులను గుర్తించారు. గతంలో పలు కేసుల్లో సైతం ఆ నలుగురూ ముద్దాయిలుగా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
మరోవైపు విశాఖలో ఓ కారు యజమాని ఫ్రస్టేషన్ ఆకాశాన్నంటింది. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఒక కారు షోరూమ్‌లో సదరు వ్యక్తి తన కారును సర్వీసింగ్‌కు ఇచ్చాడు. వాళ్లు తూతూ మంత్రంగా సర్వీసింగ్ చేసి ఇచ్చారు. దీంతో సర్వీసింగ్ బాగా చేయలేదని, షోరూంకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయినా సరే షోరూం వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఫ్రస్టేషన్‌కు గురైన కారు యజమాని కారుతో వాచ్ మెన్‌పై దాడి చేసి.. షోరూంలో ఫర్నిచర్‌పై పెట్రోల్ పోశాడు. ఈ మేరకు షోరూం మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని యానాది కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు నిలిపివేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు. బాధితుడు సాంబయ్య తన బైన్కు వ్యక్తిగత కక్షతోనే తగుల బెట్టారని ఆరోపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి...
Nagarjuna: నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..
KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్
Read Latest AP News And Telugu News