Nara Lokesh: ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:37 PM
అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక అనంతరం శాసనసభలో లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు.
అమరావతి: అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక అనంతరం శాసనసభలో లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు. ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్నపాత్రుడని పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్షకట్టిందని నారా లోకేష్ తెలిపారు.
అయ్యన్నపాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని లోకేష్ గుర్తు చేశారు. రాజకీయాలు చూస్తూ పెరిగిన వ్యక్తిని తానని.. గతంలో సభ ఎంతో హుందాగా జరిగేదన్నారు. గత ఐదేళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవహరించిందన్నారు. సభ సంప్రదాయాలను గౌరవించేలా.. సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని స్పీకర్‌ను లోకేష్ కోరారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా.. సభలో ప్రతిపక్షం లేకపోయినా.. మనమే ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. అయ్యన్నపాత్రుడిపై ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పోరాడారన్నారు. అయ్యన్నపాత్రుడి నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని నారా లోకేష్ అన్నారు.