Bheesetty Babji: రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన జగన్
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:29 AM
‘సీఎం జగన్ (CM JAGAN)... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకొని రాలేదు. మరే ఇతర అభివృద్ధినీ చేపట్టలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనంగా మార్చగలిగారు. కొన్ని తరాల యువత నిర్వీర్యం కావటానికి, వారి జీవితాలు నాశనం కావటానికి మాత్రం బాటలు వేయగలిగారు. ఇటువంటి వ్యక్తి నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించాలి. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాం’ అని లోక్‌సత్తా పార్టీ ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు.
● బినామీలు, దోపిడీదారులతో నిండిన ఆంధ్ర: లోక్‌సత్తా బాబ్జీ
● ‘కూటమి’కి లోక్‌సత్తా మద్దతు హర్షణీయం: మనోహర్
తెనాలి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్ (CM JAGAN)... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకొని రాలేదు. మరే ఇతర అభివృద్ధినీ చేపట్టలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనంగా మార్చగలిగారు. కొన్ని తరాల యువత నిర్వీర్యం కావటానికి, వారి జీవితాలు నాశనం కావటానికి మాత్రం బాటలు వేయగలిగారు. ఇటువంటి వ్యక్తి నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించాలి. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాం’ అని లోక్‌సత్తా పార్టీ ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు.
గురువారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం మొత్తం బినామీలు, దోపిడీదారులతో నిండిపోయిందని దుయ్యబట్టారు. కూటమికి లోక్‌సత్తా తన సంపూర్ణ మద్దతు ప్రకటించటం పట్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు.
AP News: చంద్రబాబును కలిసిన కోడికత్తి శ్రీను కుటుంబం.. కారణమిదే..?
మరిన్ని ఏపీ వార్తల కోసం...
నంగా మార్చిన జగన్