Share News

Narayanaswamy: మోదీ, చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:03 PM

Andhrapradesh: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ మంచి చేసినా ఎలా ఓడిపోయారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలా టాపరింగ్ జరిగిందో.. కూటమి పార్టీ ఎలా గెలిచిందో అనేది దేశమంతా కోడై కూస్తోందన్నారు.

Narayanaswamy: మోదీ, చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
Former Deputy CM Narayana Swamy

చిత్తూరు, జూలై 8: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (CM Chandrababu Naidu) మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Former Depurty CM Narayanaswamy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ (Former CM Jagan) మంచి చేసినా ఎలా ఓడిపోయారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలా టాపరింగ్ జరిగిందో.. కూటమి పార్టీ ఎలా గెలిచిందో అనేది దేశమంతా కోడై కూస్తోందన్నారు. అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. తప్పు చేస్తే తనను అయినా సరే జైల్లో పెట్టి నిలదీయాలని.. అంతేకానీ వైసీపీకి ఓట్లు వేశారన్న పేదలపై కక్ష కట్టొద్దన్నారు.

MLA Ramniwas Rawat: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రి అయిన ఎమ్మెల్యే.. ప్రమాణస్వీకారంలో అసాధారణ పరిణామం


వైసీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీలను ఇతర లీడర్లను కాల్చి పడేయాలని.. ఇలా చేస్తే భవిష్యత్తులో వారికి ఎదురే ఉండదని.. ఇష్టం వచ్చినట్లు దేశంలోనూ, రాష్ట్రంలోనూ పాలించుకోవచ్చంటూ ఫైర్ అయ్యారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయవచ్చని.. ఎవరైనా ఎవరికైనా ఓటు వేయవచ్చన్నారు. అంతమాత్రాన టీడీపీకి ఓటు వేయలేదనే నేపంతో గ్రామాల్లో ఆందోళనలు సృష్టించి దాడి చేసి ఇల్లును ధ్వంసం చేయడం చూస్తుంటే ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి పేదవారు ఓటు వేయడమే శాపంగా మారినట్లుందన్నారు. ‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు ఎలా గెలిచారో దేశ ప్రజలందరికీ తెలుసు. ఇకనైనా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలుపై దాడిని ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు’’ అంటూ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 08 , 2024 | 04:15 PM