Share News

flower palanquin పుష్పపల్లకిపై శివపుత్రుడి విహారం

ABN , Publish Date - Sep 22 , 2024 | 01:38 AM

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శనివారం రాత్రి స్వామివారు పుష్ప పల్లకిపై విహరించారు.

flower palanquin పుష్పపల్లకిపై శివపుత్రుడి విహారం

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 21: కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శనివారం రాత్రి స్వామివారు పుష్ప పల్లకిపై విహరించారు. ఈ కార్యక్రమానికి భాగ్యలక్ష్మి, దివంగత మోహన్‌నాయుడు, వీటీ రాజన్‌ అండ్‌ బ్రదర్స్‌, రామనాథ నాయుడు, కీర్తిశేషులు రాజారెడ్డి జ్ఞాపకార్థం, కీర్తిశేషులు కృష్ణమ నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు, నరసింహారెడ్డి అండ్‌ సన్స్‌, రాజారెడ్డి అండ్‌ కో, కీర్తిశేషులు శ్రీరాములరెడ్డి, బాలకృష్ణారెడ్డి, శేషయ్య నాయుడు అండ్‌ సన్స్‌, కుమరేంద్రచౌదరి, మనోహర్‌నాయుడు అండ్‌ బ్రదర్స్‌, ఆంజినేయులు నాయుడు అండ్‌ సన్స్‌ ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, చందనాలంకారాన్ని చేశాక భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురాగానే అలంకార మండపంలో స్వామివారి ఉత్సవర్లకు పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవర్లను పుష్పపల్లకిపై ఆశీనులను చేసి, కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో గురుప్రసాద్‌, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు విఘ్నేష్‌, రవి, ఉభయదారులు పాల్గొన్నారు. పుష్పపల్లకి సందర్భంగా ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.పుష్పపల్లకి సేవను వీక్షించడానికి రాష్ట్రంనుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా వేలాదిగా భక్తులు కాణిపాకం క్షేత్రానికి విచ్చేశారు.స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా కాణిపాకంలో కామధేను వాహన సేవను ఆదివారం నిర్వహించనున్నారు.

స్వర్ణ రథంపై విహరించిన వరసిద్ధుడు

కాణిపాకంలో శనివారం సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ అధికారులు కల్యాణ వేదిక వద్ద నిర్వహించారు. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం చేశాక సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను ఆస్థాన మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లను స్వర్ణరథంపై ఉంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వర్ణరథంపై స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఈవో, సూపరింటెండెంట్లు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 01:38 AM