స్టాంపుల కొరత... రిజిస్ట్రేషన్లకు కలత
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:28 AM
జిల్లావ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపుల కొరతతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఆరు నెలలుగా స్టాంపుల కొరత వేధిస్తోంది. రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100కు సంబంధించిన స్టాంపులను బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు వినియోగదారులు ఉపయోగిస్తారు. బ్యాంకులో ష్యూరిటీతో పాటు నకళ్ల దరఖాస్తుకు వినియోగిస్తారు. రిజిస్ట్రేషన్, అగ్రిమెంటు, శాశ్వత విక్రయాలు, దానపత్రాలు, క్రయవిక్రయాలు.. లాంటి లావాదేవీలకు స్టాంపులు అవసరం. అఫిడవిట్లకోసం రూ.10, రూ.20 స్టాంపులు కావాలన్నా దొరకడం లేదు. కులధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్టాంపులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు క్రయవిక్రయదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరునెలల క్రితం స్టాంపులు పూర్తిగా లేకపోవడంతో స్థానిక వెండర్ల వద్దకు వెళ్లి రెట్టింపు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దళారులు అదనపు వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు.ఈ కారణంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపులు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. ఈ-స్టాంపింగ్ విధానాన్ని అదుపు చేసేందుకోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక నాన్-జ్యుడీషియల్ స్టాంపు లు సరఫరా చేసింది.

చిత్తూరు కలెక్టరేట్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపుల కొరతతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఆరు నెలలుగా స్టాంపుల కొరత వేధిస్తోంది. రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100కు సంబంధించిన స్టాంపులను బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు వినియోగదారులు ఉపయోగిస్తారు. బ్యాంకులో ష్యూరిటీతో పాటు నకళ్ల దరఖాస్తుకు వినియోగిస్తారు. రిజిస్ట్రేషన్, అగ్రిమెంటు, శాశ్వత విక్రయాలు, దానపత్రాలు, క్రయవిక్రయాలు.. లాంటి లావాదేవీలకు స్టాంపులు అవసరం. అఫిడవిట్లకోసం రూ.10, రూ.20 స్టాంపులు కావాలన్నా దొరకడం లేదు. కులధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్టాంపులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు క్రయవిక్రయదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరునెలల క్రితం స్టాంపులు పూర్తిగా లేకపోవడంతో స్థానిక వెండర్ల వద్దకు వెళ్లి రెట్టింపు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దళారులు అదనపు వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు.ఈ కారణంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపులు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. ఈ-స్టాంపింగ్ విధానాన్ని అదుపు చేసేందుకోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక నాన్-జ్యుడీషియల్ స్టాంపు లు సరఫరా చేసింది. అయితే ఆన్‌లైన్ సమస్య వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. రోజూ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కోసం క్రయ విక్రయదారులు కార్యాలయం చుట్టూ తిరిగి,స్టాంపులు దొరక్క వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.కొన్నిచోట్ల వెండర్ల నుంచి అధిక మొత్తాలకు స్టాంపులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ల కోసం వస్తే ఆన్‌లైన్‌లో చలానా తీసుకోవడం లేదు. దీనివల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి.
ప్రభుత్వానికి నివేదించాం
నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. రూ.100 విలువ కలిగిన స్టాంపులు చిత్తూరుకు చేరాయి. వాటిని త్వరలో అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపిస్తాం. గతంలో వెండర్లకు అందించిన స్టాంపుల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నివేదిక కోరింది. త్వరలో నివేదిక పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టాం. త్వరలో స్టాంపుల కొరత తీరనుంది. స్టాంపుల కొరత లేకుండా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాం.
- వెంకటరమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్, చిత్తూరు.