CM Chandrababu: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 03:34 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్)పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ట్రిపుల్ ఆర్ చిత్రం సంచలనం సృష్టింస్తే.. ఈ లీడర్ ట్రిపుల్ ఆర్ పోలిటికల్‌గా సంచలనం సృష్టించారన్నారు.
అమరావతి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు గురువారం ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయన చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సభాపతి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తొడ్కుని వెళ్లి కూర్చోబెట్టారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్‌పై నవ్వులు పూయించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ట్రిపుల్ ఆర్‌కు.. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత సంచలన నమోదు చేసుకుందో.. రాజకీయంగా మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిందన్నారు. ఈ చిత్రంలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో.. ట్రిపుల్ ఆర్ రచ్చబండ అంత పాపులర్ అయ్యిందని గుర్తు చేశారు.
జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు వస్తాయని.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీకర్ కుర్చీకి మీరు నిండుదనం తెచ్చారంటూ ట్రిపుల్ ఆర్‌కు కితాబు ఇచ్చారు. తెలుగువారి సొంతమైన పంచ కట్టుతో తెలుగు బిడ్డలా సభకు వచ్చారని ట్రిపుల్ ఆర్‌ను సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. కొత్త బాధ్యతలతో రఘురామను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు.
అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్.. డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్‌కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత.. సభలోని ఎమ్మెల్యేలు అంతా వెళ్లి.. రఘురామ రాజుకు అభినందనలు చెప్పారు. అదే సమయంలో రఘురామ రాజుతో పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు ఫోటోలు దిగారు. ఇక అంతకుముందు ట్రిపుల్ ఆర్‌ను సభాపతి స్థానంలోకి వచ్చి ఆసీనులై.. డ్యిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.
దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణం చేసి.. స్పీకర్ సీట్లో ఆసీనులయ్యారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్‌ను పరిచయం చేయాల్సిన అవసరం లేని నాయకుడని ప్రశంసించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై రచ్చబండ పేరుతో నిర్వహించి కార్యక్రమం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని గుర్తు చేశారు.
For AndhraPradesh News And Telugu News...