ఫీజుల దోపిడీని అరికట్టాలి: ఏఐఎస్‌ఎఫ్
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:27 AM
ప్రైవేటు కార్పొ రేట్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్ నాయ కులు డిమాండ్ చేశారు.

కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కార్పొ రేట్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్ నాయ కులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురు వారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆర్‌ఐవోకు వ్యతిరేకంగా నిరసనలు తెలియ జేశారు. ఈసందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శరత కుమార్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కర్నూలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి (ఆర్‌ఐవో) ఎస్‌వీఎస్ గురువయ్య శెట్టిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు, కరపత్రాలు, మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ తల్లిదండ్రు లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఆర్‌ఐవో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనీ అన్నారు. ఈ ధర్నాలో ఆందోళన కారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నగర, అఽధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.