పురస్కారాలు ప్రతిభకు దర్పణాలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:31 AM
కళలనే ఆరాధిస్తూ శ్వాసిస్తూ ఉపాసించి నమ్ముకొని కుటుం బాన్ని పోషించుకునే కళాకారులకు అందించే పురస్కారాలు వారి ప్రతిభకు దర్పణాలని గోళ్ల నారాయణరావు అన్నారు.

పురస్కారాలు ప్రతిభకు దర్పణాలు
గోళ్ల నారాయణరావు
విజయవాడ కల్చరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : కళలనే ఆరాధిస్తూ శ్వాసిస్తూ ఉపాసించి నమ్ముకొని కుటుం బాన్ని పోషించుకునే కళాకారులకు అందించే పురస్కారాలు వారి ప్రతిభకు దర్పణాలని గోళ్ల నారాయణరావు అన్నారు. తెలుగు కళావాహిని, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ, శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా గురువారం ప్రిన్స్ మీడియా సమావేశ మందిరంలో కళాకారులకు సత్కారం జరిగింది. నటీనటులు మండల లక్ష్మి, ఎస్.అనిత, పేరం వెంకటేశ్వరరెడ్డి, బి.మల్లీశ్వర పట్నాయక్, హార్మోనిస్ట్ కె.పరబ్రహ్మాచారి, గాయకులు శ్యాంప్రసాద్, చంద్రశేఖర్, డేవిడ్‌రాజు, అమ్ముల ఎస్ ప్రసాద్‌లకు దుశ్శాలువాలను కప్పి గౌరవించారు. అనంతరం గోళ్ల మాట్లాడుతూ కళాకారులకు ఇటువంటి చిరు సత్కారం కొంత తృప్తినిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. శింగంశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాకా రులను సత్కరించు కోవడం మన సంస్కృతిని మనం గౌరవించు కొన్నట్లేనన్నారు. చింత కాయల చిట్టిబాబు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్స్, సయ్యద్ అలీ, కారుమంచి రాజు పాల్గొన్నారు.
హనుమంతరాయ గ్రంథాలయంలో..
దృశ్యవేదిక సాంస్కృతిక సేవా సంస్థ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలవారీ కార్యక్రమం గురువారం గాంధీనగరంలోని హనుమంత రాయ గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హర్ష క్రియేషన్స్, ఈవీఎస్ కళాసమితి, సాగర్ థియేటర్ ఆర్ట్స్, ఏపీ సెక్రటేరియట్ ఉమెన్ హెల్త్‌ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలు ప్రహసనాలు చేసి అలరించాయి. తదుపరి ప్రదర్శించిన ఏకపాత్రాభినయనాలు కనువిందు చేశాయి. డాక్టర్ గుమ్మా సాంబశివరావు నాటక విశ్లేషణపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడారు. కార్యక్రమాన్ని నటుడు, దర్శకుడు హెచ్‌విఆర్‌ఎస్ ప్రసాద్ పర్యవేక్షించారు.