Share News

CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 29 , 2024 | 07:37 PM

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతోపాటు రాష్ట్రంలోని చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది.

CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

విజయవాడ, అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ జస్టిస్ నజీర్‌కు సీఎం వివరించినట్లు తెలుస్తుంది. అలాగే బుధవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల కార్యచరణ గురించి గవర్నర్‌కు సిఎం చంద్రబాబు విపులీకరించినట్లు సమాచారం.

Also Read: జగన్ చెల్లికి అన్యాయం చేయకు..! విజయమ్మ లేఖ..


గత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అలాగే బడ్జెట్‌లో పొందుపరిచిన అంశాలను సైతం ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అదే విధంగా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను సైతం సీఎం హోదాలో చంద్రబాబు.. గవర్నర్‌కు వివరించారు.

Also Read: Deepavali 2024: దీపావళి వేళ.. జస్ట్ ఇలా చేయండి చాలు..


మరి ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అందుకు సంబంధించిన కేసులపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతుంది. ఆ క్రమంలో నిందితులను అరెస్ట్ చేసిన అంశాలతోపాటు చట్టపరంగా వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సైతం గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక అసెంబ్లీ సమావేశాల మీదే వీరిద్దరి మధ్య ప్రదానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ కానీ.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హజరవుతారా? అనే సందేహం సర్వత్ర వ్యక్తమవుతుంది.

Also Read: అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

Also Read: వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?


అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం ఆయన అసెంబ్లీ వైపు రాలేదు. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించినట్లు ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తుంది. ఈ అంశాలన్నింటిపై కూడా గవర్నర్‌తో సీఎం చంద్రబాబు చర్చించారని తెలుస్తుంది. అలాగే బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలంటూ గవర్నర్‌ను సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం.

Also Read: Dhantrayodashi 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది

Also Read: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Oct 29 , 2024 | 07:37 PM