Viral: తన తండ్రికి ఉద్యోగం కోరుతూ యువతి అభ్యర్థన .. నెట్టింట ప్రశంసల వెల్లువ
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:25 PM
ఆటోమొబైల్ రంగంలో అపార అనుభవం ఉన్న తండ్రికి జాబ్ ఇవ్వాలంటూ ఓ యువతి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె పోస్టు చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తన తండ్రికి జాబ్ కోరుతూ ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తండ్రిపై ఆమెకున్న ఆప్యాయత చూసి అనేక మంది ప్రశంసలు కురిపించారు. ఏ తండ్రి అయినా తనకు ఇలాంటి కూతురే కావాలని కోరుకుంటారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఈ పోస్టు పెట్టింది. తన తండ్రికి ఆటోమొబైల్ రంగంలో అపార అనుభవం ఉందని, అంచెలంచెలుగా ఎదుగుతూ పలు ఉన్నత బాధ్యతలు నిర్వహించారని చెబుతూ లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్టు పెట్టారు (Viral).
‘‘ఈ పోస్టు నా కోసం కాదు.. మా నాన్న కోసం పెడుతున్నారు. ఆటోమొబైల్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆయనకు జాబ్ ఇవ్వాలని కోరుతున్నా. ఆయనకు సోషల్ మీడియా అంతగా వాడరు కాట్టిన నేను ఈ బాధ్యత తీసుకున్నా’’
‘‘పెయింట్ షాప్ విభాగంలో ఆయనకు దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. మేనేజర్‌గా, ప్లాంట్ హెడ్‌గా, డైరెక్టర్‌గా, సీఈఓగా స్వరాజ్ మజ్దా, మారుతీ జాయింట్ వెంచర్, అల్ఫా కోటెక్ ఇండస్ట్రీ, కేడీ ఇండస్ట్రీస్ వంటి పలు సంస్థల్లో పనిచేశారు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Viral: ఎమ్‌బీయే చేశాక జొమాటోలో జాబ్ ఆఫర్ వస్తే సంతోషపడ్డాడు! శాలరీ ఎంతో తెలిశాక..
మృదుస్వభావి అయిన తన తండ్రికి ఈ రంగంలో అపార జ్ఞానం, నైపుణ్యాలు ఉన్నాయని అన్నారు. అద్భుతంగా మాట్లాడగలరని చెప్పారు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. బాస్, సీనియర్లే కాకుండా జూనియర్లు కూడా ఆయనను ఎంతో గౌరవిస్తారని అన్నారు. దశాబ్దాల క్రితం తన తండ్రి నుంచి శిక్షణ పొందిన అనేక మంది ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన పని చేస్తున్న సంస్థలో జీతాలు సరిగా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Viral: షాకింగ్.. రష్యన్ భార్యతో ఇండియాలో పర్యటిస్తుంటే..
అయితే, కుటుంబపెద్దగా ఆయనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తమ బలవంతం మీద ప్రస్తుత జాబ్‌ను వీడారని చెప్పారు. మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు.
కాగా, ఆమె పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నీలాంటి కూతురుకన్న ఆ తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతుండొచ్చని కొందరు కామెంట్ చేశారు. ప్రతి తండ్రీ తనకు ఇలాంటి కూతురే ఉండాలని కోరుకుంటారని మరొకరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
USA-Canada: కెనడా అమెరికాలో విలీనమైతే జరిగేది ఇదే..