Share News

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Jan 15 , 2024 | 02:17 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా వారి వారి సొంత గ్రామాల్లో ఈ పండుగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనీ భగవంతున్ని ప్రార్థించినట్లు చెప్పారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: PM Modi: పుంగనూరు ఆవుల్ని పెంచుకుంటున్న మోదీ.. వాటి విశేషాలివే

ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోదీకి భగవంతుడు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల నాటి కల మరికొన్ని రోజుల్లో నేరవేరనుందని తెలిపారు. అయితే అయోధ్యలో 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సందర్బంగా నేటి నుంచి ఆలయాల పరిశుభ్రత కార్యక్రమాలకు బీజేపీ(BJP) శ్రీకారం చేపట్టింది. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసిన పురంధేశ్వరి ఇంట్లో మాదిరిగా ఆలయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Updated Date - Jan 15 , 2024 | 02:17 PM