అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాథరావు
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:23 AM
అన్నవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అన్నవరం దేవస్థానం ఈవోగా వేండ్ర త్రినాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సత్యదేవుడిని దర్శించుకోగా
అన్నవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అన్నవరం దేవస్థానం ఈవోగా వేండ్ర త్రినాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సత్యదేవుడిని దర్శించుకోగా ఆలయ అర్చకులు, ఉద్యోగులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనివేటి మండపంలో బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం ఆయన కార్యాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తొలిసంతకం చేశారు. గతంలో రెండు పర్యాయాలు ఈవోగా ఆయన అన్నవరంలో బాధ్యతలు నిర్వహించారు.
రామచంద్రమోహన్‌కు వీడ్కోలు
గతేడాది కార్తీకమాసంలో అన్నవరం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రమోహన్ దేవదాయశాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లడం తో ఆయనకు బుధవారం దేవస్థానం ఉద్యోగులు వీడ్కోలు సభ ఘనంగా చేపట్టారు. ఈ ఏడాది కార్తీకమాసంలో గిరిప్రదక్షిణ నిర్వహణ, కార్తీకమాసంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేపట్టిన చర్యలపై ఆయనను ప్రశంసించారు. రామచంద్రమోహన్ దంపతులను చైర్మన్ రోహిత్, నూతన ఈవో త్రినాథరావులు సత్కరించారు.