నేడు అంబాజీపేట, అమలాపురంలలో బాబు, పవన్ షో!
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:12 AM
డాక్టర్ బీఆర్ అంబ్కేర్ కోనసీమ జిల్లాలో ప్రజాగళం పేరుతో గురువారం టీడీపీ,జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ రోడ్ షో,బహిరంగ సభలు నిర్వ హించనున్నారు.

అమలాపురం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : డాక్టర్ బీఆర్ అంబ్కేర్ కోనసీమ జిల్లాలో ప్రజాగళం పేరుతో గురువారం టీడీపీ,జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ రోడ్ షో,బహిరంగ సభలు నిర్వ హించనున్నారు.అధినేతల ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అంబాజీపేట,అమలాపురం ప్రాంతాలు వేదిక కానున్నాయి. నిడదవోలులో బుధవారం రాత్రి బహిరంగ సభ అనంతరం తిరుమలసాయి కల్యాణమండపంలో బస చేస్తారు.ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకూ రంజాన్ వేడుకల్లో పాల్గొంటారు.1.30 గంటల వరకు పార్టీ నాయకులతో సమీ క్ష, చేరికలు ఉంటాయి. అనంతరం 2.30 గంటల వరకూ గంట పాటు భోజన విరామం. పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు బ్రాహ్మణగూడెం నుంచి హెలికా ఫ్టర్‌లో చంద్రబాబు బయలుదేరతారు. పవన్ కల్యాణ్ రాజ మహేంద్రవరంలోని హోటల్ షెల్టాన్ నుంచి బయలుదేర తారు. వీరిద్దరూ గురువారం మధ్యాహ్నానికి అంబాజీపేటలో వేర్వేరుగా ఏర్పాటుచేసిన హెలిపాడ్‌లకు చేరుకుంటారు. జనసేనకు పట్టున్న అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో తొలి విడత పర్యటనలో భాగంగా ఇద్దరు నేతలు గురువారం పర్యటించి ఆయా పార్టీల కేడర్‌లో జోష్ నింపునున్నారు.ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ ఏర్పాటుచేసిన ప్రచార రథాలను జనసేన నేత ఆకుల బుజ్జి ఆధ్వర్యంలో టీడీపీ అమలాపురం అభ్యర్థి ఆనందరావు ప్రారంభించారు. బుజ్జి ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ కూడా చేపట్టారు.ఎక్కడికక్కడే టీడీపీ, జనసేన నాయకులు గురువారం జరిగే ఉభయ నేతల సభకు భారీగా జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంబాజీపేటలో బహిరంగ సభ ముగిసిన తరువాత చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఒకే వాహనంలో అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో నిర్వహించే సభాస్థలికి చేరుకుంటారు. సుమారు 6 కిలోమీటర్ల మేర జరిగే రోడ్ షోకి జనం భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అమలాపురం బహిరంగ సభ ముగిసిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కిమ్స్‌లో నైట్‌హాల్ట్ చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు చంద్రబాబు కిమ్స్‌లోనే ఉండి అమలాపురం లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితులపై జిల్లా నాయకులతో చర్చిస్తారని సమాచారం.