మద్యం షాపులను అప్పగించాలి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:00 AM
తుని రూరల్, అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన మద్యం పాలసీ విధానంలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 10శాతం మద్యం షాపులను కల్లుగీత కార్మి క
తుని రూరల్, అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన మద్యం పాలసీ విధానంలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 10శాతం మద్యం షాపులను కల్లుగీత కార్మి క సంఘాలకు అప్పగించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరా రు. తమ జాతి ఉన్నతికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని, అయితే క్షేత్రస్థాయిలో వాటి అమలకు చొరవ చూపాలని కోరారు. తేటగుంటలో క్యాంపు కార్యాలయంలో యనమలకు వినతి అందజేశారు.
యనమలను కలిసిన డీఎస్పీ
ఇటీవల పెద్దాపురం డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీహరిరాజు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని తేటగుంట టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతి భద్రతల అంశాలపై యనమల చర్చించారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ చెన్న కేశవరావు, రూరల్ ఎస్‌ఐ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.