సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర
ABN , Publish Date - Nov 25 , 2024 | 01:04 AM
గొల్లప్రోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలులోని కనకదుర్గ ఆలయం నుంచి మహా పాదయాత్ర కమిటీ ఆఽధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్య
గొల్లప్రోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలులోని కనకదుర్గ ఆలయం నుంచి మహా పాదయాత్ర కమిటీ ఆఽధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్యదేవుని సన్నిధికి భక్తులు పాదయాత్రగా వెళ్లా రు. ఆదివారం ఉదయం 8గంటలకు గొల్లప్రోలు ఈ పాదయాత్ర ప్రారంభ మైంది. సుమారు 3వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పండ్లు పంపిణీ చేశారు. భోజనం సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపకులు జ్యోతులు శ్రీనివాస్, మజ్జిగ జ్యోతుల సురేష్, అల్పహారం మామిడా సూరిబాబు, అక్కిరెడ్డి శ్రీను అందించారు.