Share News

వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:48 PM

పిఠాపురం, ఆగస్టు 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల రుణాల పేరుతో కోట్లాది రూపాయిలను నొక్కేశారని, రాష్ట్రవ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. నాయకులు, యానిమేటర్లు, వీఏఏలు, ఏపీఎంలు, డీపీఎంలు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా

వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, ఆగస్టు 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల రుణాల పేరుతో కోట్లాది రూపాయిలను నొక్కేశారని, రాష్ట్రవ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. నాయకులు, యానిమేటర్లు, వీఏఏలు, ఏపీఎంలు, డీపీఎంలు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులతో కలిసి పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పిఠాపురం మండలం బి.కొత్తూరు గ్రామంలోనే రూ.14కోట్లు మేర బ్యాంకు రుణాలను పక్కదోవ పట్టించారని, సుమారు 20గ్రామాల నిధులను పక్కదోవ పట్టించారని తెలిపారు. బి.కొత్తూరులో ఉన్న సంఘాల్లో నిబంధలనకు విరుద్ధంగా పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, శంఖవరం, కోటనందూరు, ప్రత్తిపాడు తదితర మండలాల్లోని మహిళలను సభ్యులుగా చేర్చారని చెప్పారు. తప్పుడు పత్రాలతో రుణాలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులు ఇప్పుడు నకిలీ సంఘాల్లోని సభ్యులకు నోటీసులు జారీ చేసి అప్పులు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్‌ చేశారు. సమావేశంలో పలు మహిళా సం ఘాల నాయకులు, టీడీపీ నేతలు దొడ్డి నాగు, పిల్లి చిన్నా, నల్లా శ్రీను, బస్సా సత్యనారాయణ, కొరుప్రోలు శ్రీను, ఎలుబండి బాబులు, పిల్లా సురేష్‌, కోళ్ల చిన్న, పెదపాటి బాల పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:48 PM