TDP Vs YSRCP: కోనసీమలో సై అంటే సై అంటున్న మంత్రి, ఎంపీ
ABN , Publish Date - Dec 30 , 2024 | 02:48 PM
TDP Vs YSRCP: మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్‌కు సై అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి బోస్. ‘‘ బహిరంగ డిబేట్ ఎక్కడ? ఎప్పుడు ఏర్పాటు చేసినా నేను, నా కుమారుడు వస్తాము’’ అని సవాల్ విసిరారు. ఎన్నికల హామీలు నూటికి నూరుశాతం అమలు చేసిన ఎన్నికలకు వెళ్లిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు.

కోనసీమ జిల్లా, డిసెంబర్ 30: జిల్లాలోని రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subhash) వర్సెస్ వైసీపీ ఎంపీ పిల్లి బోస్ (YSRCP MPPilli Bose) అన్నట్లుగా పరిస్థితులు మారాయి. నిన్న (ఆదివారం) మంత్రి సుభాష్ విసిరిన సవాల్‌కు స్పందనగా ఓపెన్ డిబేట్‌కు వైసీపీ ఎంపీ సిద్ధమయ్యారు. తన ఆరు నెలల పాలనలో అభివృద్ధి, గత ఐదేళ్ల వైసీపీ అవినీతిపై డిబేట్‌కు రావాలని బోస్‌కు మంత్రి సవాల్ విసిరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘‘ బహిరంగ డిబేట్ ఎక్కడ? ఎప్పుడు ఏర్పాటు చేసినా నేను, నా కుమారుడు వస్తాము’’ అని సవాల్ విసిరారు. ప్రజల్ని తాము పీడించలేదని.. టీడీపీ కార్యాలయంలో డిబేట్ పెట్టినా రావడానికి సిద్ధమని బోస్ స్పష్టం చేశారు. ‘‘మీ నాయకుడు ఉత్తముడుగా చేయడం లేదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు’’ వీటిపై చర్చిద్దాం రమ్మంటూ మంత్రికి బోస్ ఛాలెంజ్ చేశారు. ఎన్నికల హామీలు నూటికి నూరుశాతం అమలు చేసిన ఎన్నికలకు వెళ్లిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Former CM YS Jagan) అని అన్నారు.
‘‘నేను ఒక రాజకీయ నాయకుడిని.. సంఘ సంస్కర్తను కాను... మా పార్టీలో వారు అవినీతికి పాల్పడితే ఆ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతా కానీ సంఘ సంస్కర్తలా ప్రకటనలు చేయం. గత ఐదేళ్లలో మా పార్టీ నాయకుడు అవినీతికి పాల్పడ్డాడని నీ దగ్గర ఆధారాలు ఉంటే నీవు మంత్రివిగా అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయించు. అంతేగానీ గతంలో వేణుగోపాల కృష్ణను ఏమి అడుగు లేదు కాబట్టి నేను అవినీతి చేస్తే అడుగకూడదు అనే భావనతో మంత్రి వాసంశెట్టి ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్లుగా ఉంది. ప్రతిపక్షంగా మీరు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఎంపీ బోస్ స్పష్టం చేశారు.
Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మంత్రి సవాల్...
కాగా.. వైసీపీ ఎంపీపై మంత్రి సుభాష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రామచంద్రాపురంలో అంతులేని అవనీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు మంత్రి. కౌలు రైతుల పేర్లతో క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా మింగేశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. మాజీ మంత్రి వేణు, బోస్ వాటాలు పంచుకున్నారా అని నిలదీశారు. ఏరియా ఆస్పత్రులు, ద్రాక్షరామ ఆలయంలోనూ అవినీతి జరిగిందన్నారు. ఆరు నెలల పాలనలో అభివృద్ధి, గత ఐదేళ్ల వైసీపీ అవినీతిపై డిబేట్‌కు రావాలని ఎంపీ బోస్‌కు మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్ విసిరడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా
కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే
Read Latest AP News And Telugu News