Share News

AP Elections 2024: మంత్రి రోజాకు భారీ షాక్.. కీలక నేతల రాజీనామా

ABN , Publish Date - May 03 , 2024 | 05:26 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) ముందు మంత్రి రోజాకు (Minister Roja) భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా ఆమెతో పాటు ఉన్న వైసీపీ కీలక నేతలు రోజా వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. ఆమె వైఖరి నచ్చక పలువురు నేతలు జగన్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో మంత్రి రోజా తీరుపై ఆగ్రహంతో నగరిలోని 5 మండలాల వైసీపీ నేతల రాజీనామాలు చేశారు.

AP Elections 2024: మంత్రి రోజాకు భారీ షాక్.. కీలక నేతల రాజీనామా

తిరుపతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) ముందు మంత్రి రోజాకు (Minister Roja) భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా వైసీపీ కీలక నేతలు రోజా వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. ఆమె వైఖరి నచ్చక పలువురు నేతలు జగన్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో రోజా తీరుపై ఆగ్రహంతో నగరిలోని 5 మండలాల వైసీపీ నేతలు రాజీనామాలు చేశారు. ఈ నేతలంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నగరికి చెందిన వైసీపీ కీలక నేతలు మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్, వైసీపీ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డి, లక్ష్మిపతిరాజు, మురళీ రెడ్డి తదితర కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రోజా పెట్టిన కష్టాలు, అవమానాలను భరించలేక ఇద్దరు ఎంపీటీసీలు రెడ్డివారి భాస్కర్ రెడ్డి , విజయ, 6 మంది సర్పంచులు తులసిరెడ్డి, గోపి, ప్రభాకర్, సంపూర్ణ, జయమ్మ, మనోహర్ నాయుడు వైసీపీకి శుక్రవారం రాజీనామా చేశారు.


AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్

ఈ మేరకు శుక్రవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నేతలు టీడీపీలో చేరుతారని తెలియడంతో వైసీపీ అధిష్ఠానం వీరిని సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... ఐరన్ లెగ్‌గా ఉన్న ఆమె.. ఈ రోజు తమ వల్లె గోల్డన్ లెగ్ అయ్యిందని చెప్పారు. అయితే తమకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వట్లేదని.. దీంతో రోజా వైఖరి నచ్చక వైసీపీకి రాజీనామా చేశామని తెలిపారు.

ఇంకా ఎంతో మంది పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీని వీడే నేతలంతా ఆదివారం కార్యక్రమం నిర్వహించి భవిష్యత్తు ప్రకటన చేస్తామని తెలిపారు. నగరి చంద్రముఖిగా నియోజకవర్గాన్ని రోజా ఆవహించిందని విమర్శించారు. నగరి ప్రజల ఆస్తులకు రక్షణ కోసం రోజాను నగరి నుంచి తరిమి తరిమి కొట్టడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నగరిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు రెండు వేల ఎకరాలు గతంలో సేకరించారని తెలిపారు.


Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం

దురదృష్టవశాత్తు ఆ పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రోజా మంత్రి అయ్యారని తెలిపారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా పరిశ్రమల కోసం కృషి చేయాల్సిన రోజా, ఆమె సోదరులు కోట్ల రూపాయల కమీషన్లు తీసుకుని.. ఆ విలువైన స్థలాన్ని టీటీడీ వారికి ఇచ్చేశారని చెప్పారు.

రోజా, ఆమె కుటుంబ సభ్యుల అవినీతిపై రాబోయే ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు కూడా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రోజా తీసుకుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా పది శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. అధికారులను బదిలీకి, అప్రూవల్ చేయడానికి రోజా డబ్బులు భారీగా నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.


రోజా, ఆమె అనుచరులు ఇసుక, మట్టిని దోచుకుంటోందన్నారు. ప్రతి పోస్టుకూ కమీషన్ తీసుకుంటోందన్నారు. తాము చెప్పేది నిజం అనటానికి కాణిపాకంలో ప్రమాణం చేయటానికి తాము సిద్ధమని.. ఆమెను కాణిపాకానికి రావాలని సవాల్ విసిరారు. రోజాను ఈ ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఉండాలని సీఎం జగన్‌, వైసీపీ అగ్ర నేతలకు చెప్పామని అన్నారు. కానీ మార్పు చేయకుండా మరోసారి ఆమెను నగరి నుంచి పోటీ చేయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజా తమను బ్లాక్ మెయిల్ చేసి ఈ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుందని.. ఇక ఆమె అభ్యర్థి అని తేలటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రోజా నామినేషన్‌ను కూడా ఎన్నికల అధికారులు విత్ డ్రా చేశారని తెలిపారు. ఈ సారి రోజాను గెలిపిస్తే ఆమె, ఆమె కుటుంబంలోని వారి భార్య పిల్లలు కూడా బ్రోకర్లుగా తయారవుతారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమకు సపోర్టని రోజా అంటున్నారని.. ఆయన సపోర్టు చేస్తే తమను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.

Suprem Court: న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు నిందితులకు సుప్రీం నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 05:43 PM