TDP-Janasena-BJP: షాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ల భేటీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే..
ABN , Publish Date - Mar 09 , 2024 | 12:36 PM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం.
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ ముగిసింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగింది. త్వరలోనే పొత్తుతో పాటు సీట్లపై మూడు పార్టీలు అధికారిక ప్రకటన చేయనున్నాయి.
YCP: వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.