Share News

Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..

ABN , Publish Date - May 11 , 2024 | 11:36 AM

ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..
Note For Vote

ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, అనపర్తిలో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులు గరిష్టంగా రూ.5వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదట రూ.3వేలు ఇవ్వాలని, అవసరమైతే ఆ తరువాత మరో రూ.2వేలు ఇచ్చేందుకు నగదు రెడీ చేసినట్లు తెలుస్తోంది.


డబ్బుల పంపిణీ మొదలవడంతో రాజకీయ సమీకరణల్లో కొద్దిపాటి మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నియెజకవర్గాల్లో ఓట్లకు ఇచ్చే డబ్బులు విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ఓటర్లపై డబ్బుల ప్రభావం ఎక్కువుగా పడే అవకాశం ఉంది. మరోవైపు పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తుండటంతో ఓటరు అసెంబ్లీకి ఒకరికి, లోక్‌సభకు మరొకరికి వేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువుగా ఉంటుంది. అందుకే గతంలో ఒక ఓటు అయినా వేయమని అడిగే నేతలు.. ప్రస్తుతం రెండు ఓట్లు తమకే వేయాలని డబ్బులు ఇచ్చే సమయంలో చెబుతున్నారట.

AP Elections: కూటమి అభ్యర్థికి మద్దతుగా జేపీ, లోకేష్ రోడ్‌ షో


మార్పులు వచ్చేనా..!

సాధారణంగా ఎన్నికల్లో ఎంత ప్రచారం చేసినా.. చివరి రెండు రోజుల్లో పంచే డబ్బుల ప్రభావం కనిపిస్తుందని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికలకు గత ఎన్నికలకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని, గతంలో డబ్బుల పంపిణీతో ఓటరు మనసు మారేది.. ఈసారి మాత్రం ఓటరు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో నోటు ఇచ్చినా ఓటు ఎవరికి వేయాలో ఓటరు డిసైట్ అయినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వడం నాయకులే అలవాటు చేయడంతో ఓటర్లు సైతం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు తీసుకున్న ఓటరు మాత్రం ఇప్పటికే ఎటు ఓటు వేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడంతో డబ్బు ప్రభావంతో రాజకీయ సమీకరణలు పెద్దగా మారకపోవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.


నోట్లతో జాగ్రత్త..

నోట్ల పంపిణీలో అక్కడకక్కడ దొంగ నోట్లు వచ్చాయని.. ఓటర్లు ఆందోళన చేసిన సందర్భాలు గతంలో చూశాం. తమకు దొంగ నోట్లు ఇచ్చారంటూ ధర్నాలు చేశారు. అందుకే ఎవరి దగ్గరనుంచైనా డబ్బులు తీసుకుంటే ముందే చూసుకోవడం బెటర్.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా.. ముందే చూసుకుని జాగ్రత్తపడితే తరువాత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఓటుకు నోటు తీసుకోవడం ముమ్మాటికి నేరమే. ఇవ్వడం, తీసుకోవడం నేరమే.


నోటుతో ఓటరు తీర్పు మార్చవచ్చనే ఆలోచనతో గెలవాలనే ఆశ ఉన్న అభ్యర్థులు డబ్బులు పంపిణీకి శ్రీకారం చుతున్నారు. ఈ నోట్ల పంపిణీలోనూ కొన్నిచోట్ల అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఓ పార్టీ వెయ్యి ఇస్తే.. మరోపార్టీ రూ.500 కలిపి ఇవ్వడం ద్వారా ఎక్కువ ఇచ్చిన తమకే ఓటు పడుతుందని భావిస్తున్నారు. నోట్లతో ఓట్లు బదిలీ అవుతాయా.. నోటు గెలిపిస్తుందా.. ఓడిస్తుందా అనేది జూన్4న తేలనుంది.


Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 11:43 AM