Video: స్కూటీ కాదది మినీ వైన్ షాపు.. ముసలోడు ఏం చేశాడంటే..?
ABN , Publish Date - May 03 , 2024 | 12:39 PM
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి కారును చెక్ చేస్తున్నారు. రూ.50 వేలు ఆపై నగదు తీసుకెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. నగదు వివరాలు, సంబంధిత పత్రం చూపిస్తే వదిలేస్తున్నారు. లేదంటే సీజ్ చేస్తున్నారు. గోపయ్య అనే వృద్దుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారడంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు.
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరి తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీసులు ఓ స్కూటీ తనిఖీ చేశారు. ఆ స్కూటీలో భారీ మందు సీసాలు లభించాయి. ఆ స్కూటీ తీసుకొస్తుంది ఓ వృద్దుడు కావడం విశేషం.
ఏం జరిగిందంటే..?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి కారును చెక్ చేస్తున్నారు. రూ.50 వేలు ఆపై నగదు తీసుకెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. నగదు వివరాలు, సంబంధిత పత్రం చూపిస్తే వదిలేస్తున్నారు. లేదంటే సీజ్ చేస్తున్నారు. గోపయ్య అనే వృద్దుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారడంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. అక్కడ కాస్త కమీషన్ తీసుకొని విక్రయిస్తున్నాడు.
వంద క్వార్టర్లు..
నిజానికి వృద్దుడు లిక్కర్ బాటిల్స్ ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారో తెలియడం లేదు. ఈ సారి మాత్రం పట్టుబడ్డాడు. ఎన్నికల కోడ్ వల్ల మద్యం రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఆ స్కూటీలో ఏకంగా వంద క్వార్టర్లు తీసుకురావడం విశేషం. స్కూటీ ముందర లైట్ కింద బాటిళ్లను చక్కగా పేర్చాడు. పోలీసులు అడిగితే తీసి మరి చూయించాడు. స్కూటీ ముందు భాగంలో సీసాలు అన్ని వీడియోలో కనిపించాయి. అవి తీస్తూ పోలీసులు షాకయ్యారు. స్కూటీలో 100 క్వార్టర్లు తీసుకురావడం ఏంటీ అని ఆశ్చర్యపోయారు. అందులో ఎక్కువగా మాన్సాన్ హౌస్ క్వార్టర్లు సీసాలు కనిపించాయి. వృద్దుడి ఏంటీ పుష్ప మూవీలో హీరో మాదిరిగా మద్యం తీసుకొస్తున్నాడని పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.
Read Latest AP News And Telugu News