AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!
ABN, Publish Date - Apr 28 , 2024 | 08:47 PM
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రాలోని 34 సీట్లలో 2019లో వైసీపీ 28 సీట్లను గెలుచుకుంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లో 28 సీట్లను గెలుచుకుంది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 33 నియోజకవర్గాలుంటే 29 చోట్ల వైసీపీ గెలిచింది. దీంతో 101 స్థానాలకు గానూ 85 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో సీట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడు జిల్లాల్లో కనీసం 40 నుంచి 50 సీట్లు అయినా ఈసారి గెలుచుకుంటే మరో 40 సీట్లు ఇతర జిల్లాల్లో గెలుచుకోవడం ద్వారా అధికారంలోకి రావచ్చని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారట. అయితే పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశాలున్నట్లు ఆ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో 30, ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో 30, కృష్ణా, గుంటూరు జిల్లాలోని 33 సీట్లలో 28 నుంచి 30 సీట్లలో గెలవడం ద్వారా మేజిక్ ఫిగర్‌ను దాటుకోవడమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి తమ వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే కూటమి వైపు ప్రజల మొగ్గు ఉన్నట్లు అర్థమవుతుంది.
Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో
ఉత్తరాంధ్రాలో రివర్స్..
ఉత్తరాంధ్రాలోని విశాఖపట్టణం సిటీ మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాలో వైసీపీ 8, టీడీపీ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో కనీసం 8 సీట్లు ఎన్డీయే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో 7 నుంచి 8 స్థానాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, విశాఖపట్టణం జిల్లాలో 10కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో ఈ మూడు జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేయవచ్చని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో..
రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి. ఈ ఒక జిల్లాలోనే 19 నియోజకవర్గాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి టీడీపీ, జనసేన 6 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. దీంతో మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరుగుతుందని, అదే జరిగితే తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయవచ్చనే ఆలోచనలో ఎన్టీయే కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ 12 నుంచి 13 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణా, గుంటూరులో..
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి అడ్డాగా చెప్పుకోవచ్చు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత సీఎం ఎన్టీఆర్ సొంత జిల్లాకావడంతో ఈ జిల్లాలో టీడీపీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఈ జిల్లాలో టీడీపీ 2 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిగతా 14 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే కూటమి 12కు తగ్గకుండా సీట్లను గెలుచుకుంటుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలకు గానూ గత ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ జిల్లాలో 12 సీట్ల వరకు తప్పకుండా గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏడు జిల్లాల పరిధిలోని 101 సీట్లకు గానూ 80 నుంచి 88 సీట్లు గెలుచుకోవాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకుందట. కూటమి అంచనాలు నిజమవుతాయా.. లేదా వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా అనేది జూన్4న తేలనుంది.
AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Apr 28 , 2024 | 08:48 PM