AP Elections: మాట తప్పాడు.. మడమ తిప్పాడు.. హామీలు ఎగ్గొట్టాడు..!
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:38 PM
మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు.
అమరావతి, ఏప్రిల్ 27: మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు. పైగా 99.6 శాతం హామీలు అమలు చేశానంటూ పచ్చి అబద్దాలు వల్లెవేస్తారు.
నిత్యం అబద్దాలు చెబుతూ.. సీఎం స్థానం విలువను దిగజారుస్తారు.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం కొల్లగొట్టి రూ. 8 లక్షల కోట్లు లూటీ చేసి.. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ. 8 లక్షల భారం మోపారు. అంటూ ఎన్నికల వేళ వైసీపీ(YCP) ప్రభుత్వ వైఖరిని, అరాచకాలను ఎండగడుతూ టీడీపీ(TDP) ప్రజా చార్జ్ షీట్ విడుదల చేసింది.
వీటికి సమాధానం చెప్పండి జగన్ రెడ్డీ..
👉 మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా.
👉 కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా.
👉 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం.
👉 ఇసుక రేట్లు నియంత్రిస్తాం.
👉 పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తాం.
👉 25 లక్షల ఇళ్లు నిర్మి్స్తాం.
👉 ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా.
👉 అంగన్‌వాడీ, ఆశా, హోంగార్డుల జీతాలు తెలంగాణలో కన్నా రూ. 1000 అదనంగా పెంచుతా.
👉 రైతు భరోసా కుదింపు, కౌలు రైతులకు వడ్డీలేని రుణం.
👉 లీటర్ పాలకు రూ. 4 సబ్సిడీ.
👉 పోలవరం నిర్వాసితులకు రూ. 19 లక్షలు.
👉 వాషింగ్టన్ లాంటి రాజధాని.
👉 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్.
👉 ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో డీఏ
👉 సీపీఎస్ రద్దు - సకాలంలో పీఆర్‌సీ అమలు.
👉 ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి.
👉 అన్న క్యాంటీన్లను కొనసాగిస్తా.
👉 ఇమాం, మౌజన్‌లకు నెలకు రూ. 15 వేలు.
👉 పాస్టర్లకు ఇళ్లు కట్టిస్తా.
👉 ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
👉 అసైన్డ్ భూములు పరిరక్షిస్తా.
👉 పండుగలకు బస్ ఛార్జీలు తగ్గిస్తా.
👉 అద్భుతమైన రోడ్లు వేయిస్తా.
👉 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ.
👉 ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్.
👉 నగరిలో టెక్స్‌టైల్ పార్క్.
👉 రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి.
👉 టిడ్కో రూ. 3 లక్షల రుణాలు రద్దు.
‘జగన్.. ఈ హామీలన్నీ ఏమయ్యాయి. వీటిలో ఎన్ని మీరు నెరవేర్చారు. ఎన్ని ఎగ్గొట్టారు. వీటికి సమాధానం చెప్పండి. లేదంటే అబద్దాలు చెప్పడం మానుకోండి’ ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ నిలదీసింది.